ఏ నాయకుడైన...తమ అధినాయకుడు పట్ల విధేయతతో ఉండాలి...అధినేతకు విశ్వాసంగా పనిచేయాలి. నమ్మకద్రోహం చేయకూడదు. ఎలాంటి పరిస్తితుల్లోనైనా సరే నాయకుడుకు అండగా ఉండాలి. అయితే నేటి రాజకీయాల్లో అలాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నేతల్లో మంత్రి కొడాలి నాని కూడా ఒకరు. ఎందుకంటే నాని రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలోనే మొదలైంది.

అయితే పార్టీలో నానికి భవిష్యత్ ఇచ్చింది...హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే ఆ కుటుంబానికి నాని ఎప్పుడూ అండగానే ఉంటారు. వారికి ఎలాంటి కష్టమొచ్చిన ముందుంటారు. కానీ నాని, చంద్రబాబు పట్ల పెద్దగా విధేయతతో ఏమి లేరు. అందుకే ఎప్పుడైతే చంద్రబాబు, ఎన్టీఆర్‌ని రాజకీయంగా వాడుకుని వదిలేశారో అప్పటినుంచి నాని కూడా టి‌డి‌పికి దూరం జరిగారు.


అలాగే ఎన్టీఆర్ దూరం కాగానే, కొడాలి కూడా టి‌డి‌పిని వీడి జగన్ పెట్టిన వైసీపీలో చేరిపోయారు. అయితే అంతకముందు వరకు నానికి, జగన్‌తో పెద్ద సన్నిహిత సంబంధాలు లేవనే చెప్పాలి. కానీ నాని వైసీపీలోకి వచ్చాక జగన్ పట్ల ఎంత విధేయతతో ఉంటారో చెప్పాల్సిన పని లేదు. జగన్ మీద ఈగ కూడా వాలనివ్వకుండా చూసుకుంటారు. నాని కమ్మ వర్గానికి చెందిన నేత, జగన్.. రెడ్డి వర్గానికి చెందిన నేత. కానీ వారి మధ్య కులం అడ్డులేదు. అందుకే అనుకుంటా జగన్ అంటే నాని ప్రాణం ఇచ్చేసి స్థాయిలో పనిచేస్తారు. పార్టీ అధికారంలో లేకపోయినా, అధికారం ఉన్నా సరే అదే విధేయత చాటుకుంటున్నారు.

ఇక మంత్రిగా నాని...జగన్‌కు ఎలా రక్షణగా నిలబడుతున్నారో చెప్పాల్సిన పనిలేదు. ప్రతిపక్ష నేతలు జగన్‌ని ఒక్క మాట అంటే చాలు...వెంటనే మీడియా ముందుకొచ్చేసి...ప్రతిపక్ష నేతలనీ ఏకీపారేస్తారు. తప్పు అయినా, ఒప్పు అయినా నాని తన మాటలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడతారు. కాబట్టి ఇలాంటి నాయకుడు ఐదేళ్ల పాటు మంత్రిగా కొనసాగితే బెటర్ అనే అభిప్రాయం వైసీపీ శ్రేణుల నుంచి వస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: