బ‌యోమెట్రిక్ ఆధారంగా జీతాలు చెల్లింపు వ‌ద్ద‌ని స‌చివాల‌య ఉద్యోగులు కోరుతున్నారు. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌చివాల‌యాల్లో 80 శాతం మంది బాగా ప‌ని చేస్తున్నార‌ని కితాబునిచ్చారు. ఇంకా 20 శాతం మంది ప‌ని తీరును మెరుగుప‌రుచుకోవాల‌ని ఆదేశించారు.  ఇంతలోనే బ‌యోమెట్రిక్ న‌మోదు ఆధారంగా 90 శాతం వ‌ర‌కు జీతాలు త‌గ్గించ‌డంతో ప్ర‌తిపాద‌న‌లు ఇవ్వ‌డంపై స‌చివాల‌యం ఉద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  క్యాజువ‌ల్ లీవ్స్‌, ఆన్ డ్యూటీ అటెండెన్స్ రెగ్యుల‌రైజేష‌న్, ప‌బ్లిక్ హాలిడేస్ వంటివి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా లిస్ట్ త‌యారు చేయ‌డం పై అభ్యంత‌రం వ్య‌క్తం చేశార‌ని పేర్కొన్నారు.  సచివాలయ ఉద్యోగులకు ప్రోబిషన్ పూర్తి అయ్యి రెగ్యులరైజ్ , రెగ్యులర్ పే స్కేలు వర్తింపుసమయం లో  వేధింపులు ఏంటని సీఎంను ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఏ శాఖకు లేని  బయోమెట్రిక్ ఆధారంగా జీతాల చెల్లింపు.. సచివాలయ ఉద్యోగులను మాత్రమే ఎందుకు? అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బయోమెట్రిక్ అటెండెన్స్ అమలులో ఉన్న సాంకేతిక సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బయోమెట్రిక్ డివైజ్ లు పనిచేయుట లేదు అన్నది వాస్తవం,  అదేవిధంగా క్షేత్ర స్థాయి సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు.  ఏజెన్సీ ప్రాంతాల్లో  సాంకేతిక సమస్యలు, నెట్ వర్క్ ప్రాబ్ల‌మ్ వ‌ల‌న బ‌యోమెట్రిక్ అటెండెన్స్ సాధ్య‌ప‌డ‌ద‌న్నారు.

 ముఖ్యంగా వ్యాక్సినేషన్ డ్యూటీలలో పనిచేస్తున్న సిబ్బంది కి అటెండెన్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రకటిత సెలవులను హెచ్.ఆర్.ఏం.ఎస్ లో రీప్లేక్ట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. లీవ్, ఆన్ డ్యూటీ మరియు అటెండెన్స్ రెగ్యులరైజ్ లను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి సచివాలాయ ఉద్యోగికి వారి వ్యక్తిగత  యూజర్ నేమ్ , పాస్ వార్డు ఇవ్వలని స‌చివాల‌య ఉద్యోగులు త‌మ గోడును వెల్ల‌బోసుకున్నారు. మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుండా జీతాలు క‌ట్ చేస్తే మేము ఎలా బ్ర‌త‌కాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు ఉద్యోగులు. వీరి స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వం ఏమి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది వేచి చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: