గత కొన్ని రోజుల నుంచి చైనా భారత్  సరిహద్దుల్లో పరిస్థితులు రోజురోజుకీ ఉద్రిక్తంగా మారిపోతూనే ఉన్నాయి. భారత్-చైనా మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతుందో కూడా ఊహకందని విధంగానే ఉంది. అయితే గత కొన్ని నెలల కింద భారత్-చైనా మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం కొన్నిసార్లు ఒప్పందాల ద్వారా సద్దుమణిగినట్లు కనిపించింది  కానీ చైనా మరోసారి సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరిస్తూ ఉండటం కొన్ని యుద్ధ విమానాలను కూడా సిద్ధంగా ఉంచటంతో భారత్ ఒక్కసారిగా అప్రమత్తమైంది.  ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే భారత్ కూడా సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరిస్తుంది.



 యుద్ధ విమానాలను కూడా తెచ్చి పెడుతుంది.  దీంతో భారత్ చైనా మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతుందో అన్న విధంగా మారిపోయింది ప్రస్తుతం పరిస్థితి. అదే సమయంలో అటు పాకిస్థాన్ చైనా మధ్య ఉన్న సంబంధం కూడా భారత్కు ప్రమాదకరంగా మారి పోతుంది అనే చెప్పాలి. ఇక ఈ రెండు దేశాలు కూడా ఒక్కసారిగా భారత్ ఫై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి అన్నది కూడా రక్షణ రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా  సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాము అంటూ ఇప్పటికే భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవల చైనా తీరుపై త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 చైనా వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం దక్షిణ ఆసియాలో ప్రాంతీయ స్థిరత్వానికి ఎంతో ప్రమాదకరంగా మారి పోతుంది అంటూ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు చైనా ఈ ప్రాంతంలో పెద్దయెత్తున రహదారుల నిర్మాణం చేపడుతుంది అంటూ తెలిపారు. అంతేకాదు దక్షిణాసియా ప్రాంతంలో ఆధిపత్యం సాధించడం కోసం వివిధ దేశాలలో విపరీతంగా చైనా పెట్టుబడులు పెట్టడం కూడా మొదలు పెట్టింది అంటూ బిపిన్ రావత్ తెలిపారు. అయితే పాకిస్తాన్ చైనా మధ్య ఉన్న సంబంధాలు కూడా భారత్ కు చాలా డేంజర్ అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్.

మరింత సమాచారం తెలుసుకోండి: