ఉమ్మ‌డి ఆంధ్రాలో అనేక ఆటు పోట్లు, రాజ‌కీయ ఎత్తుగ‌డలు చ‌వి చూసిన కేసీఆర్ త‌రువాత తెలంగాణ ఏర్పాటు త‌రువాత ఇంకాస్త బ‌ల‌ప‌డిన నాయ‌కుల్లో ఒక‌రుగా అగ్ర‌శ్రేణీ నాయ‌కుడిగా ఎదిగారు అన్న‌ది వాస్త‌వం. ఆ మాట‌కు వ‌స్తే తెలంగాణ వాకిట మ‌రో పార్టీ ప్ర‌త్యామ్నాయం అన్న‌ది లేకుండా పాల‌న సాగించింది కూడా కేసీఆరే! ఇవాళ జాతీయ పార్టీలేవీ అక్క‌డ కేసీఆర్ ధాటికి నిల‌బ‌డ‌లేక పోతున్నాయి అన్న‌ది కూడా వాస్త‌వం. బీజేపీ, కాంగ్రెస్ రాజ‌కీయాలు అన్న‌వి పెద్ద‌గా ప్ర‌భావితం చేయ‌వు అన్న‌ది కూడా ఇదివ‌ర‌కే తేలిపోయింది. రేవంత్ రెడ్డి గొంతెత్తి మాట్లాడినా, తిట్టిపోసినా కేసీఆర్ స్థాయి నేత అయితే కాదు. ఆ మాట‌కు వ‌స్తే ఇవాళ తెలంగాణ‌లో కేసీఆర్ కు స‌మ ఉజ్జీనే లేరు. భౌగోళిక, రాజ‌కీయ, సామాజిక ప‌రిణామాల‌పై ఆయ‌న‌కు ఉన్న ప‌ట్టు కార‌ణంగానే అంత‌టి పేరు వ‌చ్చింది అన్న‌ది వాస్త‌వం. ఇక ఆంధ్రా ప‌రిణామాల‌ను సైతం ఆక‌ళింపు చేసుకుని మాట్లాడే స‌త్తా కేసీఆర్ కే ఉంది. జ‌గ‌న్ త‌న‌దైన రాజకీయం చేస్తున్నా పొరుగున ఉన్న సీఎం కేసీఆర్ ప్రోద్బ‌లంతోనే ప‌నిచేస్తున్నార‌న్న‌ది నిజం. ఓ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల పెద్ద దిక్కు కేసీఆర్ అని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి అయితే లేదు.

ఇక జ‌గ‌న్ క‌న్నా కేసీఆర్ ఎందుకు బెట‌ర్ అంటే.. ముందు నుంచి తెలంగాణ ఏర్పాటు ద‌గ్గ‌ర నుంచి అనేక విష‌యాల్లో కేసీఆర్ త‌లొగ్గింది లేదు. నీటి వాటాల‌కు సంబంధించి, కృష్ణా జ‌లాల పంపిణీకి సంబంధించి కేసీఆర్ ముందునుంచి ఒకే వాద‌న వినిపిస్తు న్నారు. త‌న‌కు బాగా ప‌ట్టున్న ప్రాజెక్టుల‌కు సంబంధించిన వివరాల‌పై కొత్త ప్రాజెక్టుల రూప‌క‌ల్ప‌నపై ఎప్ప‌టిక‌ప్పుడు అధికారుల తో చ‌ర్చిస్తూనే ఉన్నారు. అంతేకాదు ఈ విష‌య‌మై కేసీఆర్ త‌న‌దైన వ్యూహంతో వ్య‌వ‌సాయ మోటార్ల‌కు విద్యుత్ మీట‌ర్ల ఏర్పాటును కూడా అడ్డుకున్నారు. కేంద్రం ఏం చెబితే అదే అన్న  విధంగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తే, ఇందుకు పూర్తి విరుద్ధంగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించి త‌న పేరు నిల‌బెట్టుకున్నారు.


అధికారంలోకి వ‌చ్చేందుకు ల‌క్ష కోట్ల విలువైన ప‌థ‌కాలు ప్ర‌క‌టించి జ‌గ‌న్ నానా ఆర్థిక ఇక్క‌ట్లు చ‌విచూస్తే, కేసీఆర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తూ వ‌స్తున్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు అక్క‌డా ఉన్నా కూడా ఖ‌జానాకు భార‌మ‌య్యే ప‌నులు పెద్ద‌గా చేయ‌లేదు. ద‌ళిత బంధు మిన‌హా మిగ‌తా ప‌థ‌కాలన్నీ గ‌తంలో ఉన్న‌వే. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే కేంద్రంతో త‌గాదాలున్నా కూడా ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణానికి వ‌సంత్ విహార్ ద‌గ్గ‌ర స్థ‌లం సంపాదించారు. అంతేకాదు ఉమ్మ‌డి ఆస్తుల పంపకంలో కూడా కేసీఆర్ దే పైచేయి. ఇప్ప‌టికీ తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రా ఆస్తుల‌కు సంబంధించి ఓ స్ప‌ష్ట‌త లేదు. జ‌గ‌న్ సీఎం అయిన వెంట‌నే తాళాలు అప్ప‌గించి వ‌చ్చేశారు. ఇలా అన్నింటిలోనూ కేసీఆర్ దే పై చేయి అయి ఉంటోంది. ఓ విధంగా జ‌గ‌న్ క‌న్నా కేసీఆర్ గ్రేట్.


మరింత సమాచారం తెలుసుకోండి:

trs