ఏపీ సీఎం జగన్‌కూ కోర్టులకూ ఉన్న లడాయి తెలిసిందే.. జగన్ సీఎం అయ్యాక అనేక కేసుల్లో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి.. అయితే ఇలాంటివి కోర్టుల్లో సహజం. అందులోనూ దూకుడుగా వెళ్లే జగన్ సర్కారుకు ఇలాంటివి చాలా కామన్. అయితే కావాలనే చంద్రబాబు అండ్ కో కోర్టులను అడ్డం పెట్టుకుని ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని సాక్షాత్తూ సీఎం జగనే గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖ రాశారు.


ఇలాంటి నేపథ్యంలో ఇటీవలి కాలంలో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా కాస్త తీర్పులు తగ్గాయి. జగన్ సర్కారు కాస్త ఊపిరి పీల్చుకుంది. కానీ.. ఇప్పుడు వరుసగా మళ్లీ జగన్ సర్కారుకు అక్షింతలు పడుతున్నాయి. జగన్ సర్కారు ఏకంగా సీఎంను తిడుతున్నాడన్న అభియోగంతో టీడీపీ నేత పట్టాభిని అరెస్టు చేసి జైళ్లో పెట్టిస్తే.. రెండు రోజులు కూడా గడవకుండానే ఆయనకు బెయిల్ వచ్చేసింది. మరోవైపు మరో టీడీపీ యువ నేత నాదెండ్ల బ్రహ్మం కేసులోనూ ఇలాగే జరిగింది.


అంతే కాదు.. బ్రహ్మం కేసులో.. ఆయన తనను కోట్టారని కోర్టుకు విన్నవించుకుంటే... దానిపైనా కోర్టు సీరియస్ అయ్యింది. కొట్టారని బ్రహ్మం చెబుతుంటే.. ఆరోగ్య పరీక్షలు ఎందుకు చేయించలేదని మెజిస్ట్రేట్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే అమరావతికి చెందిన కొందరు రైతుల యాత్ర విషయంలోనూ త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పుడు వీటికి తోడు టీడీపీ నేత, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చెందిన గ్రానైట్‌ కంపెనీకి ఏపీ ప్రభుత్వం జారీచేసిన షోకాజ్ నోటీసులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.


అసలేమైందంటే.. గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇచ్చింది. దీనిపై గ్రానైట్ కంపెనీ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. రూ.50 కోట్ల జరిమానా విధిస్తున్నట్టు షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. దీనిపై గొట్టిపాటి హైకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం ఇచ్చిన  షోకాజ్ నోటీసులను సింగిల్ బెంచ్ కొట్టి వేసింది. అయితే సర్కారు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ ఆ ఆదేశాలను పక్కన బెట్టింది. గొట్టిపాటి మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు సుప్రంకోర్టులో జగన్ సర్కారు ఇచ్చిన నోటీసులపై స్టే వచ్చింది. ఇలా వరుసగా మళ్లీ జగన్ సర్కారుకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: