హుజురాబాద్ నియోజ కవర్గ ఉప ఎన్నికల్లో... విజయం ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ అన్ని పార్టీలు.. తమ పార్టీని గెలుస్తుందని ధీమా తో ఉన్నారు. ఇక అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలు తమ పార్టీని గెలిపిస్తారని ఆలోచన చేస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ...  ఘాటు సానుభూతి మరియు సెంటిమెంటు ఆధారంగా కానీ గెలుస్తాం అని ఈటెల రాజేందర్ భావిస్తు న్నారు. ఇది ఇలా ఉండగా మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ మరోలా వ్యూహాలు రచిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ మరియు కేంద్రంలోని బీజేపీ పార్టీ వ్యతిరేక ఓట్లు తనకే పడతాయని ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్. అయితే  టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నాయకులు సొంతం గా సర్వేలు చేయిం చుకుంటున్నారనీ సమాచారం అందుతోంది. 

హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల్లో.. ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారని దానిపై స్వయంగా టీఆర్ఎస్ నేతల సర్వే చేయించారట. అయితే... ఈ సర్వేలో షాకింగ్ నిజాలు బయట పడ్డట్లూ సమాచారం అందుతోంది.  మొన్నటి వరకు ఈ ఎన్నికల్లో.. భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ఈ సర్వేలో తేలిందని సమాచారం.  అయితే నిన్నటి వరకు చేసిన సర్వేల్లో... అధికార టీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వారి సొంత సర్వేలో తేలిన అని తెలుస్తోంది.

అయితే టిఆర్ఎస్ పార్టీ నేతలు నిజంగానే సర్వే చేయించుకున్నారా లేదా కావాలనే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఉప ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ఇరు పార్టీలు. అయితే... ఈ ఉప ఎన్ని కల్లో ఎవరూ గెలుస్తారో త్వరలోనే క్లారిటీ రానుంది. నవంబర్  2 వ తేదీన ఈ ఉప ఎన్నిక పై క్లారిటీ రానుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: