ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సీఎం ను చేసిన అంశాలు చాలానే ఉన్నాయి. అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై ఉన్న వ్య‌తిరేక‌త కావ‌చ్చు. అప్పుడు మిగిలిన సామాజిక వ‌ర్గాల‌ను పూర్తిగా అణ గ దొక్కేసి క‌మ్మ సామాజిక వ‌ర్గం చెలాయించిన హ‌వా కావ‌చ్చు. చంద్ర‌బాబు రాజ‌ధాని తో పాటు అభివృద్ధి విష‌యంలో ఆడిన డ్రామాలు కావ‌చ్చు.. ఇంకా చెప్పాలంటే రైతు రుణ‌మాఫీ చేస్తాన‌ని చెప్పి మాట త‌ప్పిన విష‌యాలు కావ‌చ్చు. ఇలా ఎన్నో విష‌యాలు నాడు ప్ర‌భుత్వం పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌కు కార‌ణం కావ‌డంతో పాటు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఏకంగా 151 సీట్ల‌తో బంప‌ర్ మెజార్టీ క‌ట్ట‌బెట్టాయి.

స‌రే ఈ రోజు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి గా ఉన్నారంటే అందుకు ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న చేసిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రే అని చెప్పాలి. అయితే ఇప్పుడు యువ నేత‌లుగా అధికారం కోసం నానా తంటాలు ప‌డుతూ జ‌గ‌న్‌ను ప్ర‌తి నిత్యం విమ‌ర్శిస్తోన్న లోకేష్, పవన్ నిజంగా అన్ని రోజుల పాటు ప్ర‌జ‌ల్లో ఉంటూ ప్ర‌జ‌ల కోసం పాద‌యాత్ర చేసే సాహసం చేస్తారా..? అంటే ఖ‌చ్చితంగా నో అనే చెప్పాలి.

నాలుగు రోజులు రాజ‌కీయాలు.. మ‌రో నాలుగు రోజులు సినిమాలు అనే ప‌వ‌న్ త‌న 341 రోజుల విలువైన కాల్షీట్ల ను ప్ర‌జ‌ల కోసం ఖ‌ర్చు చేస్తారా ? అంటే డ‌బ్బుల ప‌రంగా లెక్క‌లు వేసుకుని అది త‌న‌కు గిట్టు బాటు కాద‌నే ప‌వ‌న్ అనుకుంటారు. అస‌లు ప‌వ‌న్‌కు అంత ఓపికే లేదు. ఇక చంద్ర‌బాబు ఇప్పుడు వ‌య‌స్సు పై బ‌డ‌డంతో పాద‌యాత్ర లు చేయ‌రు. ఇక చిన‌బాబు సైకిల్ యాత్ర‌లు అని ఫీల‌ర్లు వ‌దులుతున్నా అదే జ‌ర‌గ‌డం లేదు.

చిన‌బాబు పై పార్టీ నేత‌ల‌కే న‌మ్మ‌కం లేకుండా పోయింది. ఆయ‌న ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వ‌స్తారా ? అన్న‌ది సందేహ‌మే.. ఏదేమైనా ఇప్పుడున్న యువ‌నేత‌ల్లో ఇంత సుధీర్ఘ‌మైన పాద‌యాత్ర రికార్డు ఒక్క జ‌గ‌న్‌కే సాధ్య‌మైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: