ఇప్పటికే తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు లేఖలు రాశారు. ఈ రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఐదుగురు ఉన్నతాధికారుల బృందం రేపు ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉంది. రేపు బకాయిల అంశంపై చర్చించేందుకు ఉన్నతాధికారులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు కలవబోతున్నారు.
ఇక రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కు ఏపీ జెన్‌కో రూ.11,157 కోట్ల మేర బకాయి పడినట్టు తెలుస్తోంది. అక్టోబరు 31 నాటికి రూ.405 కోట్లు బకాయి పడిన ఏపీ జెన్‌కో.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.141 కోట్లు బకాయి పడింది. 90 రోజుల గడువు దాటడంతో జెన్‌కోను ఎన్‌పీఏగా ప్రకటించింది ఆర్‌ఈసీ. అంతే కాదు.. ఇన్‌సాల్వన్సీ అండ్ బ్యాంకరప్ట్‌సీ కోడ్ వినియోగంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు మొత్తం రూ.2 వేల కోట్ల మేర బకాయిలు ఉన్నాయి.
ఇప్పటికే డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని హెచ్చరించిన పీఎఫ్‌సీ ప్రతినిధులు ఇప్పుడు సెటిల్ మెంట్ ోసం రాష్ట్రానికి వచ్చారు. ఈ పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ ప్రతినిధులు ముందు సీఎస్ తో చర్చిస్తారు. ఆ తర్వాత ఆ చర్చలు అంత సఫలం కాని పక్షంలో సీఎం జగన్‌తోనూ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకునేందుకు తెలుగు దేశం సిద్ధంగా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి