అయితే.. అసలు ఏదైనా టీవీ షోలో ఎవరైనా రూ. కోటి రూపాయలు గెలుచుకుంటే.. వాస్తవానికి ఆ విజేత చేతికి వచ్చే ఎమౌంట్ ఎంతో తెలుసా.. ఈ విషయం తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు.. ప్రైజ్ మనీపై పన్నులు ఉంటాయని తెలుసు కానీ.. మరి ఇంతగా పన్నులు వేస్తారా అని షాక్ అవుతారు. నిజమే మరి.. ఏదైనా షోలో రూ. కోటి గెలుచుకుంటే.. విజేత చేతికి వచ్చేది.. రూ.68,80,000 మాత్రమే. మిగిలిన రూ.31,20,000 వేలు పన్ను రూపంలో కట్టాల్సి ఉంటుంది. అంటే దాదాపు 31 లక్షలు పన్ను రూపంలో ప్రభుత్వానికి వెళ్తుందన్నమాట.
మరి ఈ పన్ను ఎలా నిర్ణయిస్తారు అంటారా.. సాధారణంగా ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా షోలో పాల్గొని ప్రైజ్ మనీ రూ.10,000 మించి గనుక గెలిస్తే విజేత పన్ను కట్టాల్సి ఉంటుంది. రూ. 10 వేలు దాటిన బహుమతులపై ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిచాల్సి ఉంటుంది. గెలిచిన డబ్బుపై ఐటీ యు/ఎస్ 194బి చట్టం ప్రకారం పన్ను విధిస్తారు. ప్రస్తుతం ఈ పన్ను 31.2% వరకూ ఉంది. అంటే.. ఓ కోటి రూపాయలు గెలుచుకుంటే.. 31 లక్షల రూపాయలు పన్ను కిందే పోతుందన్నమాట. ప్రైజ్ ఇచ్చే సమయంలోనే ఈ పన్ను మినహాయించి మిగిలిన సొమ్ము ఇస్తారన్నమాట.
ఈ లెక్కన మీలో కోటీశ్వరులలో కోటి గెలిస్తే విజేతకు వచ్చేది కేవలం 68 లక్షలే అన్నమాట. తాజాగా కొత్తగూడెం పట్టణానికి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ బీ రాజారవీంద్ర ఇలా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొన్న ఆయన మొత్తం 15 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రూ. కోటి గెలుచుకున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి