ఏపీలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే కీలకంగా ఉండే జిల్లా ఏదైనా ఉందంటే...అది తూర్పు గోదావరి జిల్లా. ఎందుకంటే ఏపీలో ఇదే అతి పెద్ద జిల్లా. ఇక్కడే ఎక్కువ సీట్లు ఉన్నాయి. జిల్లాలో 19 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజారిటీ సీట్లు దక్కించుకున్న పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు అదే సీన్ రిపీట్ అవుతూ వస్తుంది. అయితే ఈ సారి జిల్లాలో పాగా వేయాలని ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే టీడీపీ దూకుడుగా రాజకీయం చేస్తుంది. ఇదే సమయంలో టీడీపీతో పాటు జనసేన కూడా సత్తా చాటాలని చూస్తుంది.

ఎందుకంటే తూర్పులో జనసేనకు కూడా పట్టు ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో రాజోలు సీటుని జనసేన దక్కించుకుంది. అలాగే పలు నియోజకవర్గాల్లో భారీగానే ఓట్లు తెచ్చుకుంది. దీంతో జనసేన కూడా జిల్లాలో బలంగా ఉంది. అయితే టీడీపీ-జనసేనలు కలిసి ఈ సారి వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఒకవేళ అదేగనుక జరిగితే తూర్పులో మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పడటం ఖాయమని చెప్పొచ్చు.

ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీకు టీడీపీ మీద వచ్చిన మెజారిటీ కంటే..జనసేనకు పడిన ఓట్లే ఎక్కువ. అంటే టీడీపీతో జనసేన కలిస్తే ఏం అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో వీరు ఖచ్చితంగా పొత్తుతో బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదే జరిగితే తూర్పులో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే. రెండు పార్టీలు పొత్తుతో వస్తే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పడే ఛాన్స్ ఉంది. ఇక అందుకు తగ్గట్టుగా ఎమ్మెల్యేలని బలోపేతం చేయాల్సిన బాధ్యత జగన్‌ది. రెండు పార్టీల పొత్తుకు తగ్గట్టుగా బలమైన అభ్యర్ధులని దింపాలి...రాజకీయ, సామాజిక వర్గాల సమీకరణాలు మార్చాలి. అప్పుడే రెండు పార్టీలని వైసీపీ ఎదురుకోవాలి. ఇదంతా జగనే సెట్ చేయాలి. లేదంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు.  

మరింత సమాచారం తెలుసుకోండి: