భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే మంత్రులు ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇన్చార్జి మంత్రులు ఆయా జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిరక్షించాలి అంటూ ఆదేశాలు జారీ చేసారూ. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ బాధితులకు అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేసారూ సీఎం జగన్.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సమస్యలను అధికారులకు దృష్టికి వచ్చి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలి అంటు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వరద ప్రభావం మళ్ళీ తిరిగి సాధారణ పరిస్థితి నెలకొని వరకు కూడా వరద బాధితులకు మంత్రులు ఎమ్మెల్యేలు అండగా ఉండాలి అంటే ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. అంతేకాకుండా వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసారూ. అయితే ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాలు సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకూ ఎమ్మెల్యేలు మంత్రులు అసెంబ్లీకి రాకపోయినా పర్వాలేదు అని సీఎం జగన్ చెప్పినట్లు తెలుస్తోంది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి