ఇప్పుడు కొత్తగా తీసుకువస్తున్న కార్యక్రమం హెల్త్ ప్రొఫైల్.. తెలంగాణలోని ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఈ తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ప్రయోగాత్మకంగా అమలు కాబోతోంది. డిసెంబరు మొదటి వారంలో దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అధికారుల కమిటీలు ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించి ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తాయి.
అసలు ఈ హెల్త్ ప్రొఫైల్ అంటే ఏంటి అంటారా.. ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం, ఆధార్ నంబర్, డెమోగ్రాఫిక్ వివరాలు, మధుమేహం, బీపీ, ఇతర వ్యాధుల వివరాలను సేకరిస్తారు. దీన్ని ఆ వ్యక్తి హెల్త్ ప్రొఫైల్‌గా పిలుస్తారు. ఈ సమాచారం ఆధారంగా వారి ఆరోగ్యానికి సంబంధించిన రిస్క్ అసెస్మెంట్, హై రిస్క్ వాళ్లను గుర్తిస్తారు. దాన్ని బట్టి అవసరమైవ సేవలు అందిస్తారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్‌లో దాదాపు 8 టెస్టులు చేస్తారు. దీన్ని మరింత పెంచాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇలా పరీక్షలు పూర్తి అయిన వారి ఆరోగ్య సమాచారాన్ని క్లౌడ్ స్టోరేజీ చేస్తారు. ఇలా జిల్లాలోని ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం నిక్షిప్తం చేస్తారు. దీనివల్ల ఏ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లినా.. ప్రమాదానికి గురైనా.. అతని హెల్త్ ప్రొఫైల్ ఆధారంగా ఆరోగ్య సమాచారమంతా క్లౌడ్ స్టోరేజ్ నుంచి వాళ్లు తీసుకుంటారు. చికిత్స వేగంగా ఖచ్చితంగా జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ హెల్త్ ప్రొఫైల్ సమాచారం పకడ్బందీగా నమోదైతే.. ప్రభుత్వం కూడా ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించడం సులువు అవుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. బావుంది కదా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి