రాజ్యాంగం, ప్రజాస్వామిక వ్యవస్థ ఈ దేశంలో సామాన్య ప్రజానీకం అభివృద్ధిలో ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నవి. తదనుగుణంగా వ్యవస్థను మరింత ఉన్నతీకరణ చేయడానికి అనేక కారణాలతోపాటు మద్యపానం 75 శాతానికి పైగా ప్రతిబంధకంగా మారిందని దాని నిర్మూలనే ఆరోగ్యవంతమైన భారతావని నిర్మాణానికి మూలమని విశ్లేషకులు, పరిశీలకులు, మేధావులు అభిప్రాయపడుతూ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు. అయినా ఎవరిలో మార్పు రావడం లేదు . తాగిన మైకంలో ఆత్మహత్యలకు పాల్పడడం, భర్త లేదా భార్య ను కుటుంబ  సభ్యులను హత్య చేయడం, సామూహిక వ్యక్తిగత అత్యాచారాలకు పాల్పడడం, బహిరంగ హత్యలు, అనేక సామాజిక రుగ్మతలకు మద్యపానం కారణమవుతున్నది. దాని పర్యవసానంగా అనేక కుటుంబాలు పిల్లలు అనాధలుగా మారడం, ఎందరో ప్రాణాలు కోల్పోవడం, మతిస్థిమితం కోల్పోవడం ,పెద్దదిక్కును కోల్పోవడం, ఆస్తుల లూటీ ,దహనాలు వంటి అనేక రకాల పరిణామాలకు కారణం అవుతున్నది. అయినా అనుభవిస్తూనే ఉన్నాము కానీ దీని వెనుక గల కారణాలను నివారణ మార్గాలను ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, మద్యపాన ప్రియులు, యువజన సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు కూడా అంతగా పట్టించుకోక పోవడం విచారకరం.
మద్యపాన నిషేధానికి సంబంధించిన వివరణ:-


ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో భాగంగా ఉన్న గుజరాత్ ప్రాంతానికి సంబంధించి నాటి రాష్ట్ర ప్రభుత్వం 1949 లో మద్యపాన నిషేధ చట్టం చేసినది 1951 నుండి ఈ చట్టం అమలు కాగా గుజరాత్ రాష్ట్రం స్వతంత్రంగా ఏర్పడిన తర్వాత 1960 నుండి మద్యపాన నిషేధం పూర్తిస్థాయిలో నేటికి అమలు అవుతూనే ఉన్నది. అయితే సరిహద్దులో ఉన్న రాష్ట్రాల నుండి అక్రమంగా సరఫరా కావడం వలన ఆదాయం రాకపోయినప్పటికీ గుజరాత్ లో అక్కడక్కడా అక్రమ వినియోగం జరుగుతున్న మాట వాస్తవం. బీహార్, త్రిపుర ,మిజోరం ,అండమాన్ వంటి తదితర కొన్ని రాష్ట్రాలలో మద్యపాన నిషేధం అమలు అవుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా అమలు కారణంగా దీని ఫలితాలను పాక్షికంగానే పొందగలుగుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: