అనుకున్నదంతా అయ్యింది.. అంతా భయపడినట్టే జరిగింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ఇండియాకు కూడా వచ్చేసింది. బెంగళూరులో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్టు కేంద్రం ప్రకటించింది. అయితే.. ఈ రెండు కేసులు వచ్చిన తీరు చూస్తే చాలా షాకింగ్‌గా ఉంది. సేఫ్టీ కోసం ఈ ఒమిక్రాన్ కేసులు వివరాలను కేంద్రం పూర్తిగా వెల్లడించడం లేదు. కానీ.. వయస్సుల వారీగా వివరాలు తెలిపింది. కేంద్రం తెలిపిన వివరాలు ప్రకారం.. గత నెల 20న దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా ఇండియా వచ్చిన ఓ విదేశీ ప్రయాణికుడు ఇండియా ఒమిక్రాన్‌ను తీసుకొచ్చాడు.


ప్రస్తుతం ప్రపంచమంతటా అమలవుతున్న కొవిడ్‌ రూల్స్ ప్రకారం.. కరోనా నెగిటివ్ రిపోర్టు లేకుండా ఎయిర్ పోర్టుల్లో అడుగు పెట్టనివ్వడం లేదు. అలాగే కరోనా నెగిటివ్ రిపోర్టుతో దక్షిణాఫ్రికా నుంచి ఇండియా వచ్చిన 66 ఏళ్ల విదేశీయుడు.. బెంగళూరులో దిగగానే కరోనా టెస్టు చేయించుకున్నాడు. అయితే అతనికి కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో అతడిని క్వారంటైన్‌లో ఉంచారు అధికారులు. అయితే అప్పటికే ఒమ్రికాన్ గురించి ప్రపంచం అంతా గగ్గోలెత్తడంతో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారికి జీనోమ్‌ సీక్వెన్సింగ్ కూడా చేసి కరోనా వేరియంట్‌ను నిర్ధారిస్తున్నారు.


అందులో భాగంగానే ఈ ఆఫ్రికా దేశస్తుడికి జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం శాంపిల్ పంపారు. విచిత్రం ఏంటంటే.. గత నెల 23న అదే విదేశీయులు ‌ప్రైవేటుగా కరోనా టెస్టు చేయించుకుంటే మాత్రం నెగిటివ్ వచ్చింది. ఎందుకైనా మంచిదిని అధికారులు ఆ విదేశీయుడి కాంటాక్ట్‌లకు కూడా కరోనా టెస్టులు చేయించారు. దాదాపు 100 మందికి చేయించినా అందరికీ నెగిటివ్ వచ్చేసింది. ఆ తర్వాత అతనికి గతల 27 మరోసారి టెస్ట్ చేసి నెగిటివ్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత అతడు తాను దుబాయ్ వెళ్లానంటే అంగీకరించారు. అయితే తాజాగా జీనోమ్ సీక్వెన్సింగ్‌ రిపోర్టులో అతనికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. అంటే సదరు విదేశీ ప్రయాణికుడు వచ్చి ఇండియాకు ఒమిక్రాన్ అంటించి.. చక్కా దుబాయ్ వెళ్లాడన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: