ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన వరదల దెబ్బకి రాయలసీమ ప్రాంతంలో ప్రజలు రోడ్ల మీద పడటంతో విపక్షం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేసే విధంగా ముందుకు వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అదే విధంగా కొంతమంది టీడీపీ   నాయకులు కాస్త గట్టిగా టార్గెట్ చేయడం అలాగే చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాలకు పర్యటనకు వెళ్లడం వంటివి జరిగాయి. ఇక దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ భారీగా ఆర్థిక సహాయం ప్రకటించాలని వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవాలని టీడీపీ  డిమాండ్ చేస్తోంది.

అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ విపక్షాన్ని ఇబ్బంది పెట్టే విషయంలో దాదాపుగా సఫలమయ్యారు అనే ప్రచారం కూడా మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు అదేవిధంగా కడప పర్యటనకు వెళ్లిన సందర్భంగా ప్రజలతో మమేకం కావడంవల్ల కష్టాలు తెలుసుకోవడం దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైసీపీ వైరల్ చేయడం వంటివి తెలుగుదేశం పార్టీకి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లిన సమయంలో ప్రజలు పెద్దగా ఆయన వద్దకు రాకపోవడం అధికార పార్టీ నాయకులు వెళ్లిన సమయంలో వచ్చే కష్టాలు చెప్పుకోవడం వైసీపీకి బాగా కలిసి వచ్చిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

రాజకీయంగా ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల సమస్యలను తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే విషయంలో ముందడుగు వేసిన సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని జిల్లాల్లో పర్యటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది అనే అభిప్రాయం టీడీపీ  నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ  లో ఉన్న చాలామంది నాయకులు ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్లిన సరే ప్రజలు వచ్చి తమ వద్ద ఏ సమస్య కూడా చెప్పక పోవడం పట్ల టీడీపీ నాయకులను కూడా మాత్రం కాస్త వేధిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: