ఇప్పుడు చేయడానికేం లేదు..అడ్జెస్ట్ అవ్వడమే
సారీ చెప్పినా కూడా ఫలితం లేదు..
ఉన్న పరువు పోయాక ఏం చెప్పినా నో యూజ్


వైసీపీలో అంతర్మథనం మొదలయిపోయింది. గతంలో కన్నా ఇప్పుడు మరింత మార్పు కోరుకునేలానే ఉన్నారు నేతలు. పొరపాటున నోరు జారామని, పొరపొచ్చాలకు తామే కారణమని వైసీపీ నాయకులు భావించినా, తమ పార్టీకి చెందని వ్యక్తి, టీడీపీ  నుంచి ఇటుగా వచ్చి తమకు మద్దతు పలికారే తప్ప ఆయన అధికారికంగా మా పార్టీ కాదని వంశీని ఉద్దేశించి వ్యాఖ్యానాలు చేసినా ఇవన్నీ దిద్దుబాటు చర్యలే!



ఆంధ్రావనిలో రాజకీయాలు మరింత దిగజారి  వ్యక్తిగత దూషణలకే పరిమితం అయిపోతున్నాయి. రోజురోజుకూ వ్యక్తిగత జీవితాల ను వెలుగులోకి తీసుకువచ్చేందుకే కాలం వెచ్చిస్తున్నారే తప్ప ఈ ప్రాంత నాయకులు ప్రజా శ్రేయస్సుకోరి పని చేయడం లేదు అన్నది ఓ వాస్తవం. దీంతో నాయకుల తీరుపై విసుగు చెందిన ప్రజలు వర్తమాన పరిణామాల నడవడిపై ఏహ్యత పెంచుకుంటున్నా రు. అసహ్యించుకుంటున్నారు. హుందాతనం పోయి మరీ! నీఛంగా ఒకరినొకరు తిట్టుకోవడం అన్నది ఎప్పటికీ ఆహ్వానించదగ్గ పరిణామం కాదనే అంటున్నారు ప్రజలు. దీంతో మారుతున్న పరిణామాలు మారుతున్న రాజకీయాలు పురోగామి దిశగా లేకపోగా తిరోగామి వైపు వెళ్తున్నాయి. విలువలు వెనక్కు మళ్లుతున్నాయి. ఒకనాటి రాజకీయాల్లో విలువలే ప్రాధాన్యం. కానీ ఇప్పుడు అవేవీ లేకుండా పోయి ఎవరి ఇష్టం వచ్చిన విధంగా వారు మాట్లాడుతున్నారు. లేదు లేదు తోచిన విధంగా మాట్లాడి పరువు పోగొట్టుకుంటున్నారు.


 

నిన్నమొన్నటి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇలానే నడిచాయి. తెలుగుదేశం పార్టీ అధినేత వ్యక్తిగత జీవితం, అదేవిధంగా ఆయన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటివి ఓ స్థాయిని దాటి పోయాయి. దీంతో ఇరు పార్టీల తీరుపైనా ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్న మాట కేవలం సభల్లోనే కాక మీడియా పాయింట్ల దగ్గర కూడా సిగ్గు విడిచి మాట్లాడుతుండడంతో ప్రజలన్నా, పాలన అన్నా కనీస ఆలోచన లేని నాయకుల్లో తామెలా మార్పు  తీసుకురాగలమని వీరంతా ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: