ఒకటో తారీఖునే జీతాలు
ఆశించిన రీతిలో వేతన సవరణలు
ఇవన్నీ ఉంటే ఉద్యోగి పనిచేస్తాడు లేదంటే
ఉద్యమం అని చెప్పి వీధికెక్కి
రచ్చ చేస్తాడు.. ఇదే కదా బండి శ్రీను చెప్పాలనుకుంటున్నది


 

ఏపీ  ఎన్జీ ఓ సంఘ పెద్ద దిక్కు బండి శ్రీనివాసరావు తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. దిగజారిన ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగుల కోరికలు తీర్చలేమని ఇప్పటికే ఏపీ సర్కారు తేల్చేసింది. కాస్త సమయం ఇస్తే అన్నీ సర్దుకుంటాయిని కూడా చెబుతోంది. కానీ పొలిటికల్ మైలేజీ కోసం బండి శ్రీను నోటికి వచ్చిందంతా మీడియా ముందు వాగుతున్న కారణంగానే కొత్త వివాదం వస్తోంది. ఉద్యోగుల విషయమై వైసీపీ సర్కారు సానుకూలంగానే ఉన్నా అంత స్థాయిలో వేతన సవరణ కు ఓకే చేసేలా లేదు. ఎందుకంటే ఇప్పటికే అప్పుల్లో సర్కారు ఉంది కనుక. ఇవేవీ అర్థం చేసుకోకుండా విధులలో భాగస్వామ్యం పంచుకోకుండా కేవలం ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా బండి శ్రీను మాట్లాడుతుండడంతో వివాదం నానాటికి పెరిగి పెద్దదవుతోంది.


ఉద్యోగ సంఘాలకూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న రగడ కారణంగా ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు తెరపైకి వచ్చారు. అప్పటిదాకా ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఈ తరుణంలో బండి శ్రీను చెప్పే మాటలు వినిపించే విమర్శలు కొన్ని ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. బండి శ్రీనివాసరావు నేతృత్వంలో ఇటీవల సమావేశం అయిన జేఏసీలు చాలా నిర్ణయాలు తీసుకుని పీఆర్సీ అమలుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని భావించాయి. ఇదే క్రమంలో ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ విన్న జగన్ అప్రమత్తం అయ్యారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అంటున్నారు. వాస్తానికి బండి శ్రీను అయినా మరొకరు అయినా ఎప్పటి నుంచో జగన్ తో సఖ్యతగా ఉన్నావారే! దిగువ స్థాయి ఉద్యోగుల ఒత్తిళ్ల కారణంగానే వాళ్లు మాట్లాడారు. బాగుంది కానీ  ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము బండి శ్రీను ఉందా అన్నదే ఓ పెద్ద సందిగ్ధం.


మరింత సమాచారం తెలుసుకోండి: