అమరావతిపై తమకు ప్రేమలేదని విశాఖపైనే తమకు ప్రేమ ఉందని వైసీపీ చెప్పకనే చెప్పే ప్రతిమాట చెప్పించే ప్రతి ప్రకటన కూడా రూఢీ చేస్తున్నాయి. ఈ దశలో రాజధాని నిర్మాణం అన్నది ఒక జరగని పని అని అది జగన్ కు చేతగాదు అని టీడీపీ ఆరోపిస్తూ నిరసనలు చేస్తోంది. కానీ తమకు ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చే ఆలోచనలే లేవని వైసీపీ నాయకలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్మ సామాజిక వర్గం ప్రభావితం అయ్యేలా, వారి ఆర్థిక పురోగతికి సాయం అందించేలా తమ నాయకుడు ఉండరని రెడ్డి నాయకులు చెబుతున్నారు.
రాజధాని విషయమై ఎటూ తేల్చకుండానే రెండున్నరేళ్లు కాలం గడిపేసిన బర్త్ బోయ్ ( రేపు పుట్టిన్రోజు) మరికొన్ని రోజులు ఇలానే వ్యవహరించనున్నారు. పాలనలో కదలిక లేని కారణంగా అమరావతి పనులు కూడా కదలిక లేకుండానే పోయాయి. కొన్ని భవం తులు మాత్రం అలానే ఉండిపోయాయి. కొన్నింటికి చెల్లింపులు లేక ఆగిపోయి, నిర్మాణాలు మన ప్రభుత్వాల తీరును వ్వెవ్వెవ్వె అ ని వెక్కిరిస్తున్నాయి. ఈ క్రమంలో రాజధానిలో విజయవాడ, గుంటూరు జిల్లాలను కలుపుతూ మంగళగిరి, తాడేపల్లిని కలుపుతూ చేయాలనుకున్న ఓఆర్ఆర్ కు అసలు ఊసే లేకుండా పోయింది. భూ సేకరణకు కానీ మరో పనికి కానీ జగన్ ముందుకు రారు అని కూడా తేలిపోయింది. అంటే గత ప్రభుత్వం తీసుకున్న ఏ ఒక్క నిర్ణయాన్నీ అమలు చేసేదే లేదని జగన్ తేల్చేశారన్నది నిజం అయి పోయింది. దీంతో రాజధాని ఏర్పాటుకు సంబంధించి నమ్మకాలు పెట్టుకున్న వారంతా ఇక ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. భూ సేకరణకు కావాల్సిన నిధులు సమకూర్చి సంబంధిత పనులు త్వరితగతిన చేపట్టాల్సిన ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఊసే లేకుండా వ్యవహరిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి