వాస్తవంగా చూస్తే తెలంగాణలో 2023లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారా ? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం అప్పుడే వ్యూహాలు రచిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే కేసీఆర్ కేంద్రంతో యుద్ధానికి దిగుతున్నట్టు కూడా రాజకీయ మేధావులు చెబుతున్నారు.
ఇదే విషయాన్ని బిజెపి మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ కూడా తెలిపారు. కెసిఆర్ ప్రణాళికలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లేలా ? ఉన్నాయని అరుణ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల తనను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలకు సైతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వంతో తమ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారట.
తెలంగాణలో బలమైన సామాజిక వర్గాలతో పాటు... బలంగా మాట్లాడే వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా ఆయన వారికి వివరించినట్టు తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కసితో ఉన్న కేసీఆర్ దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం కూడా నడుస్తోంది. ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా సంకేతాలు రావడంతో వారు కూడా ఎన్నికలకు రెడీ అవుతున్న పరిస్థితి తెలంగాణలో ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి