మత సామరస్యానికి కేరాఫ్ అడ్రస్ అయిన దేశం భారత్. భారత్లో కేవలం ఒకే మతం కాదు ఎన్నో రకాల మతస్తులు కూడా స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటారు. అందరికీ సమానమైన హక్కులు కలిగి ఉంటాయ్. అంతేకాదు ప్రతి ఒక్కరూ తమ మతంతో పాటు ఇతర మతాలను గౌరవించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే భారత్లో  మతపరమైన గొడవలు జరిగాయి అంటే చాలు.. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని మతపరమైన స్వేచ్ఛ లేదు అంటూ డ్రాగన్ దేశం కలగ జేసుకుంటు ఉంటుంది . ఇలా ఇతర దేశాలకు కల్లబొల్లి మాటలు చెప్పే చైనా మాత్రం తమ దేశంలో మైనారిటీల విషయంలో దారుణంగా వ్యవహరిస్తూ ఉంటుంది.



  వీకర్ ముస్లింల విషయంలో చైనా వ్యవహరించిన తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది అన్న విషయం తెలిసిందే.. తమ మతపరమైన మందిరాలకు వెళ్లకుండా నిషేదించటం.. అంతేకాకుండా తమ మతపరమైన భాషలో చదువుకోకుండా నిషేధం విధించడం లాంటివి చేస్తుంది. ముస్లింలు ఇస్లామిక్ భాష మాట్లాడటంపై కూడా నిషేధం విధిస్తూ నియంత పాలన సాగించింది చైనా. ఇలా మైనారిటీలపై అణచివేతకు పాల్పడుతూ వచ్చేది. ఇక ఇప్పుడు చైనా ప్రభుత్వం కన్ను మరో మతంపై పడినట్లు తెలుస్తోంది.



 చైనాలో వీకర్ ముస్లింలతో పాటు క్రిస్టియన్లు కూడా మైనారిటీలుగా కొనసాగుతున్నారు. అయితే పాశ్చాత్య దేశాలతో సంబంధాలు నేపథ్యంలో అటు క్రిస్టియన్ల పై మాత్రం ఎలాంటి నిషేధం విధించలేదు చైనా ప్రభుత్వం. కానీ ఈ సారి మాత్రం చైనా ప్రభుత్వం మరింత తెగించింది. చైనాలో మైనారిటీలుగా కొనసాగుతున్న క్రిస్టియన్ మతస్తులపై కూడా కఠిన ఆంక్షలు విధించింది. ఆన్లైన్లో విదేశీయులు మతపరమైన కంటెంట్ వ్యాప్తిపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది.  జాతీయ భద్రత దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాము అంటూ చైనా ప్రభుత్వం చెప్పడం గమనార్హం. ఇక చైనా కొత్త రూల్స్ ప్రకారం బుద్ధుడిని ఆరాధించడం.. ధూపం వేయడం.. జపం చేయడం.. క్రిస్టియన్ మతం మార్చుకోవడం అనుమతించరు. అంతే కాకుండా మతం పేరుతో నిధులు సేకరించడాన్ని అనుమతించబోమని  అంటూ ప్రభుత్వం తెలిపింది. ఇలా చైనా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నిబంధనలు మాత్రం సంచలనంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: