రైతు సమస్యలపై పోరాడేందుకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రచ్చబండ అనే కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. దీన్ని రేపు సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ ఉన్న ఎర్రవల్లిలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. ఈ సమయంలో రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నుంచే షాక్ తగిలింది. ఈ కార్యక్రమానికి నేను రాను అంటూ మెదక్ జిల్లాలోని ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలిగారు. ఈ కార్యక్రమం గురించి తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆయన కినుక వహించారు.
ఆయన ఏంటున్నారంటే.. “ రేపు ఎర్రవెల్లి లో రేవంత్ రెడ్డి ప్రకటించిన రచ్చబండ కార్యక్రమం ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన కార్యక్రమం.. ఆ జిల్లా లో ఏకకై ఎమ్మెల్యేను నేను.. అంతే కాదు.. నేను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ను కూడా.. ప్రెస్ మీట్ పెట్టే సమయంలో కానీ.. కార్యక్రమం ప్రకటించేటప్పుడు కానీ ఆ జిలాల్లో ఉన్న ఏకైక ఎమ్మెల్యేను ఐన నాతోటి చర్చించలేదు.. ఇది బాధాకరం.. జిల్లాలో రేవంత్ రెడ్డి ఏదైనా కార్యక్రమం తీసుకుంటే మా తో చర్చించి నిర్ణయం తీసుకున్నారని అనుకుంటారు.. కానీ మా తో చర్చించకుండానే నిర్ణయం తీసుకుంటారు.
గతంలో ఎప్పుడైనా ఇలాంటి విషయాలు మీడియా ముందయినా మీటింగ్లో మాట్లాడితే నన్ను మాట్లాడవద్దని వదిలేయమని చెప్పేవారు.. ఇలాంటి కార్యక్రమాలను ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటే పార్టీకి నష్టం జరుగుతుంది... కాబట్టే నేను ఇప్పుడు మీడియా ముందు ఇప్పుడు ప్రకటన చేయాల్సివస్తుంది. మాకు తెలియకుండా ఆయన ప్రకటించిన రచ్చబండ కార్యక్రమంలో మేము కనపడకపోతే మా పై రాంగ్ సిగ్నల్ తీసుకెళ్లిన్నట్లే కదా.. రేవంత్ రెడ్డికి ఈ హక్కు ఎవరు ఇచ్చారు..?
పీసీసీ అంటే అందరిని కలుపుకొని పోయే పోస్ట్... అందరిని విడదీసే పోస్ట్ కాదు..చాలా బాధగా ఉంది మీడియా ముందు ఇలాంటి ప్రకటన చేయడానికి.. అంతర్గత విషయాలు మీడియా ముందు చెప్పడానికి చాలా బాధగా ఉంది.. ఇలాంటి కార్యక్రమాలు పీసీసీ వర్కింగ్ కమిటీ ఐన పీఏసీ మీటింగ్ లో చర్చించకుండానే ప్రకటన చేస్తున్నారు.. అందుకే ఈ కార్యక్రమాన్ని నేను బాయ్కాట్ చేస్తున్నా.. ఇలాంటి నిర్ణయాలను నేను తీవ్రంగా ఖండిస్తూ రేపు అధిష్టానానికి లేఖ రాస్తా అంటున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి