సరిగా ఇటువంటి పరిస్థితుల్లోనే నెల్లూరు జిల్లాకు చెందిన కృష్ణపట్నం మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన ఆనందయ్య అనే వ్యక్తి ఒక ఆయుర్వేద మందును తయారుచేసి కరోనాకు విరుగుడుగా దేశవ్యాప్తంగా మంచి పేరును తెచ్చుకున్నారు. ప్రజలు కూడా ఈ మందును బాగా నమ్మారు, దీనితో డిమాండ్ పెరిగింది. జాతీయ స్థాయిలో ఒక సంచలనముగా మారింది. కానీ ఈ మందును పబ్లిక్ గా పంచడానికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అడుగడుగునా అడ్డంకిగా మారుతూ వచ్చింది. ఆ తర్వాత కోర్ట్ జోక్యంతో గ్రీన్ సిగ్నల్ వచ్చి మందును సరఫరా చేశారు. అయితే ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ లాగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వచ్చి ప్రజల్లో మరింత ఆందోళన పెంచింది. ఇపుడు కూడా ఆనందయ్య మందును థర్డ్ వేవ్ కు ఇస్తానని ముందుకు వచ్చినా... ఈ సారి ఏకంగా సొంత గ్రామానికి చెందిన వైసీపీ నాయకుల నుండి వ్యతరేకత ఏర్పడింది.
అయితే ఇందుకు కారణం ఏమిటని చూస్తే, ఆనందయ్య యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు మరియు ప్రస్తుతం వైసీపీ పార్టీ ఎంపీటీసీ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా సొంత పార్టీ వారినే వైసీపీ నాయకులు అణగదొక్కేస్తే మిగతా వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ తన ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు సామాన్య ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నా ఇలా సొంత పార్టీకి చెందిన బీసీ నేత ఆనందయ్య మందును అడ్డుకోవడం పట్ల ప్రజలకు ఏమి సమాధానం చెబుతారో ఆలోచించుకోవాలని పలువురు విమర్శిస్తున్నారు. మరి ఇది ఇంకెంత దూరం వెలుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి