రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు.. సీఎం జ‌గ‌న్ వ‌రాలు కురిపించారు. ఈ క్ర‌మంలో వారి ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు ను ఏకంగా.. రెండు సంవ‌త్స‌రాలు పెంచారు. అయితే.. దీనిని కూడా విమ‌ర్శించే వారు .. విమ‌ర్శిస్తున్న‌వారు ఉన్నారు. కానీ, లెక్క‌లు వేసుకుంటే.. జ‌గ‌న్ పెంచిన రెండేళ్ల పెంపు కార‌ణంగా.. ఒక్కొక్క ఉద్యోగికి.. దాదాపు 20 ల‌క్ష‌లకు పైగా అద‌న‌పు ల‌బ్ధి చేకూరుతుంద‌ని సీనియ‌ర్ ఉద్యోగులు లెక్క‌లు వేసుకుంటున్నారు. నిజానికి ఒక్క సంవ‌త్స‌రం ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంచేందుకు.. ప్ర‌భుత్వాలు అల్లాడిపోతుంటాయి. దీనికి కార‌ణంగా.. ఆర్థికంగా త‌మ‌పై భారం ప‌డుతుందనే ఆలోచ‌న‌తోనే!

గ‌తంలో చంద్ర‌బాబు రెండేళ్లు పెంచారు. అప్ప‌ట్లోనే ఆయ‌న అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డ్డారు. అప్ప‌టికి ఉద్యోగులు ఎన్నో రూపాల్లో చేసిన డిమాండ్ల నేప‌థ్యంలో ఆయ‌న పెంచాల్సి వ‌చ్చింది. దీనిలోనూ ఆయ‌న ఓటు బ్యాంకును వెతుక్కున్నార‌నే వాద‌న వినిపించింది. కానీ.. ఇప్పుడు.. జ‌గ‌న్ మాత్రం ఎవ‌రూ అడ‌కుం డానే.. ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ‌ వ‌యో ప‌రిమితిని.. రెండేళ్ల‌కు పెంచారు.

దీనిపై.. ఆయ‌న బెనిఫిట్స్ ఇవ్వ‌లేక‌నే.. ఇలా వ‌యోప‌రిమితిని పెంచారంటూ.. కొన్ని వ‌ర్గాలు విమ‌ర్శ‌లు చేశాయి. కానీ, వాస్త‌వం చూస్తే.. ఇప్ప‌టికిప్పుడు.. ఉద్యోగులు రిటైర్ అయితే.. వ‌చ్చే ల‌బ్ధి క‌న్నా.. రెండేళ్ల త‌ర్వాత‌.. ఏకంగా వారికి 20 ల‌క్ష‌ల‌కు పైగానే ల‌బ్ధి చేకూరుతుంద‌ని అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఎలా అంటే.. ఇప్ప‌టికే 7వ పీఆర్సీ అమ‌లు అవుతోంది. వ‌చ్చే ఏడాది నుంచి సెంట్ర‌ల్ పీఆర్సీ అమ‌లు చేస్తే.. అప్పుడు భ‌త్యాలు పెరుగుతాయి. అదేస‌మ‌యంలో వ‌య‌సును బ‌ట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పీఎఫ్‌, వైద్య ఖ‌ర్చులు.. ఇలా అనేక రూపాల్లో ఉద్యోగుల‌కు మేలు జ‌రుగుతుంది.

అదే క్ర‌మంలో ఈఎల్స్‌ను క్యాష్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. లేదా.. వాడుకునే అవ‌కాశం ఉంటుంది. ఇది కూడా ల‌క్ష‌ల్లోనే ఉంటుంద‌ని.. ఉద్యోగులు చెబుతున్నారు. ఇక‌, అత్యంత కీల‌క‌మైన వ‌య‌సులో ప్ర‌బుత్వం నుంచి వైద్య సేవ‌ల‌ను పొందే అవ‌కాశం ఉంటుంది. సో.. ఇవ‌న్నీ కూడా అద‌నంగా వ‌చ్చిన సౌకర్యాలు.. ఇక‌, ఉద్యోగం మ‌రో రెండేళ్లు పెంచ‌డం వ‌ల్ల‌.. రుణాలు తెచ్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇలా.. అనేక రూపాల్లో ప‌రోక్షంగా ఉద్యోగుల‌కు ఒక్కొక్క‌రికీ 20 నుంచి 30 ల‌క్ష‌ల ల‌బ్ధి చేకూరుతుంద‌ని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: