ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రఘురామకృష్ణంరాజు రాజీనామా అంశం బాగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. వైసీపీ నుంచి గెలిచి ఇంతకాలం అదే వైసీపీపై విమర్శలు చేస్తూ వస్తున్న రాజుగారు..రాజీనామాకు రెడీ అయిన విషయం తెలిసిందే. వైసీపీకి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో చూపిస్తానని రఘురామ సవాల్ చేస్తున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో సత్తా చాటుతానని రఘురామ అంటున్నారు.

అయితే ఇంతకాలం తమపై విమర్శలు చేస్తూ వస్తున్న రఘురామకు చెక్ పెట్టడానికి వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలిసిందే. ఆయనకు ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పి..ఆయనపై వేటు వేయించడానికి కూడా ప్రయత్నించింది. అలాగే ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ కూడా చేయించింది. ఆయన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. రఘురామ వైసీపీకి పెద్ద తలనొప్పిలా తయారయ్యారు. ఇలా వైసీపీకి చుక్కలు చూపిస్తూ వస్తున్న రఘురామ సడన్‌గా రాజీనామాకు సిద్ధమయ్యారు.

అలాగే నరసాపురం ఉపఎన్నికల బరిలో నిలబడి వైసీపీని ఓడించాలని చూస్తున్నారు. అయితే ఈయన బీజేపీలో చేరి, టీడీపీ-జనసేనల మద్ధతుతో పోటీ చేస్తారని తెలుస్తోంది. లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి..ఆ మూడు పార్టీల మద్ధతు తీసుకోవచ్చని సమాచారం. సరే ఆయన ఎలా బరిలో దిగిన చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. కానీ ఇక్కడ రఘురామ సరికొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేయడం గ్యారెంటీ అని ..అలాగే ఉపఎన్నిక వస్తే గెలవడం కూడా గ్యారెంటీ అని రాజు గారు చెబుతున్నారు.

ఆ విషయం వైసీపీకి కూడా తెలుసని, అందుకే ఉపఎన్నిక రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ స్కెచ్ వేయొచ్చని, ఉపఎన్నిక వాయిదా పడేలా చేయొచ్చని, కరోనా పేరుతో ఉపఎన్నిక జరగకుండా చూసుకుంటారని రఘురామ మాట్లాడుతున్నారు. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే రఘురామ రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరి ఎంపీ పదవికి రఘురామకృష్ణం రాజు ఎప్పుడు రాజీనామా చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: