సంక్రాంతి పండుగ వచ్చిందంటే సంబరాలు ఏ రేంజిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సామాన్యులు సంపన్నులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.. తెలుగు ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి కూడా ఒకటి అనే విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు సంక్రాంతికి ఎంతో స్పెషల్ గా భావిస్తూ పండుగలను జరుపుకుంటారు. ఇక సంక్రాంతి పండగ సమయాల్లో పట్టణాలు నగరాలు అనే తేడా లేకుండా అంతటా పండుగ శోభను సంతరించుకుంటోంది.


 సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు హరిదాసుల కీర్తనలు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదండోయ్ రంగురంగుల గాలి పటాలను ఎగుర వేస్తూ ఎంతో మంది సంతోష పడి పోతూ ఉంటారు. సంక్రాంతి పండక్కి ఆకాశంలో ఎక్కడ చూసినా గాలిపటాలు దర్శనమిస్తూ ఉంటాయి. అయితే ఇలా గాలిపటాలు ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉన్నారు. పదునైన మాంజా లు వాడటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అంటూ చెబుతూ ఉంటారు. ప్రతి సంక్రాంతికి కూడా ఇలా మాంజా కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 ఇలా పదునైన మాంజా ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది  గాలిపటం మాంజా మరొకరి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది.. ఇద్దరు దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో గాలిపటానికి కట్టిన మాంజా వాహనం నడుపుతున్న వ్యక్తి మెడకు చుట్టుకుంది. ఇక బైక్ వేగంగా వెళుతుండటంతో ఆ మాంజా బైక్ నడుపుతున్న వ్యక్తి మెడకు బిగుసుకుపోయింది. దీంతో ఏకంగా గొంతు తెగి పోయింది. ఇక తీవ్ర రక్తస్రావం కావడంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నిమిషాల వ్యవధిలో భర్త చనిపోవడంతో భార్య అరణ్యరోదనగా విలపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: