దేశంలో కరోనా ఇపుడు మళ్ళీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేసులు రోజు రోజుకీ పెరుగుతూ వైరస్ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇపుడు జాగ్రత్త పడాల్సిన సమయం కాదు, జాగ్రత్తగా ఉండాల్సిన సమయము కాదు, అత్యంత అలెర్ట్ గా ఉంటూ ప్రతి నిముషం మీకు , మీ కుటుంబానికి వైరస్ సోకకుండా రెప్ప పాటు ఏమర పాటు లేకుండా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యాక్సిన్ వేసుకున్న వారు ఒక రకంగా కొంత వరకు సేఫ్ జోన్ లో ఉన్నట్లే, అలాని మరీ నిర్లక్ష్యంగా ఉండకండి. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి సైతం కరోనా సోకుతుందన్నది మీకు తెలిసే ఉంటుంది. అయితే ప్రమాదం పెద్దగా లేదని డాక్టర్లు అంటున్నారు.

ఇక చిన్నారుల గురించే తల్లితండ్రుల బాదంతా.... ఇపుడు ఎటు చూసినా కరోనా బాధితులే కనపడుతున్నారు. దేశం, రాష్ట్రం, ఊర్లు దాటి మన వీధుల్లోకి కూడా కరోనా ఎంటర్ అయి పోయింది. ఇప్పటికే మనకు తెలిసి, తెలియకుండా మన వీధి లోనే కొందరు కరోనాతో బాధ పడుతూ ఉండొచ్చు, అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇపుడు వచ్చిన కరోనా పెద్దగా ప్రమాదం లేదని కొందరు శాస్త్రజ్ఞులు అంటుంటే, చాలా తక్కువ మంది మాత్రమే సీరియస్ జోన్ లోకి వెళుతున్నారు అని మరి కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. ఏదేమైనా తల్లితండ్రులు తమ పిల్లలని వైరస్ కు దూరంగా ఉంచడం సురక్షితం.

అందుకే మీ జాగ్రత్తలో మీరు ఉండండి. పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెంచేందుకు పోషకాహారాన్ని అందించండి, విటమిన్ D పుష్కలంగా అందేలా ఎండలో కాస్త ఆడనివ్వండి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకొంత కాలం మీ పిల్లలని వైరస్ బారిన పడకుండా సంరక్షించుకోండి. మనము మన వైపు నుండి ఎటువంటి పొరపాటు లేకుండా చూసుకుంటే తర్వాత ఆ భగవంతుడు ఎలా చేస్తే అలా అవుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: