క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలే ఆవేశపరుడు. అందులోను చంద్రబాబునాయుడు, లోకేష్ అంటేనే అగ్నికి ఆజ్యం పోసినట్లుంటుంది కొడాలికి. చిన్నగా గిల్లితే కూడా పెద్దగా రెచ్చిపోయే గుణమున్న వ్యక్తి కాబట్టే వ్యూహాత్మకంగా కొడాలిని టీడీపీ పదే పదే రెచ్చగొడుతోంది. ఇపుడు కూడా కాసినో పేరుతో ట్రాప్ చేసి రెచ్చగొట్టింది. ఇంకేముంది కొడాలి ఆకాశమే హద్దుగా రెచ్చిపోయి అబ్బా కొడుకులిద్దరిపై ఓ రేంజిలో తిట్లదండకం అందుకున్నారు.
నిజానికి కొడాలి మాటలు ఎలాగుంటాయో, ఎంత దూకుడుగా ఉంటారో కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేయటంలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంటారు. ఇదే సమయంలో కొడాలిని రెచ్చగొడితే టీడీపీకి కొత్తగా వచ్చేది లేదు పోయేదీ లేదు. అయినా కొడాలి తమను తిట్టేశాడంటు గోల గోల చేసి జనాల సానుభూతి పొందాలన్నదే టీడీపీ చీపు ట్రిక్కు. తాజా వివాదానికి కారణమైన కాసినో వ్యవహార కూడా ఇందులో భాగమే.
సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని కొడాలికి చెందిన కే కన్వెన్షన్లో కాసినో జరిగిందనేది చంద్రబాబు అండ్ కో ఆరోపణలు, వీళ్ళకు ఎల్లోమీడియా నూరుశాతం మద్దతు. నిజానికి గుడివాడలో కాసినో జరిగినా, జరగకపోయినా మామూలు జనాలకు ఎలాంటి సంబంధంలేదు. కాసినో జరిపించాడు కాబట్టి కొడాలి రాజీనామా చేయాలనేది టీడీపీ నేతల డిమాండ్. దీనికి కొడాలి కౌంటరుగా టీడీపీ హయాంలో ఎన్నో క్లబ్బులు నిర్వహించ లేదా అంటు మండిపోయారు. పనిలోపనిగా కే కన్వెన్షన్లో ఎలాంటి కాసినో జరగలేదన్నారు.
ఎక్కడివో రికార్డింగ్ డ్యాన్సుల క్లిప్పింగులు తీసుకొచ్చి తన మ్యారేజీ హాలులో జరిపించినట్లు ఎల్లోమీడియా, టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటు రెచ్చిపోయారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే కే కన్వెన్షన్లో ఏమి జరిగిందనేది పక్కన పెట్టేస్తే టీడీపీ హయాంలో తమ్ముళ్ళు తమకు అవకాశమున్నంతలో చేసుకున్నారు. ఇపుడు వైసీపీ వాళ్ళూ అలాగే చేసుకుంటున్నారు. టీడీపీ ఇప్పుడు చేస్తున్న కాసినో గోల వల్ల మామూలు జనాలకు ఏమన్నా ఉపయోగమా ? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వదిలిపెట్టేసి అవసరం లేని అంశాలను పట్టుకుని టీడీపీ నానా యాగీ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: