జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చాలా కోపం వచ్చేసింది. పార్టీలో కొందరు కోవర్టుల్లాంటి వాళ్ళున్నారట. అలాంటి వాళ్ళు పవన్ పేరును ఉపయోగించుకుని వ్యక్తిగతంగా ఎదుగుతున్నారట. అలాంటి వాళ్ళను పార్టీ కమిటిలకు దూరంగా ఉంచమని పవన్ చాలా సీరియస్ గా చెప్పేశారు. కొందరు తమ వ్యక్తిగత ఎదుగుదలకు తన పేరును ఉపయోగించుకుంటున్నారంటు మండిపడ్డారు.
చివరివరకు తనకు జేజేలు కొడుతు, తనచుట్టూనే తిరుగుతు చివరి మూడు రోజుల్లో ఇటు తెలుగుదేశంపార్టీ అటు వైసీపీలోకి వెళ్ళిపోయేవాళ్ళను దగ్గరకు రానీయద్దంటు స్పష్టంగా చెప్పారు. అలాంటివాళ్ళు ఎవరో కూడా తనకు తెలసన్నారు. అయితే పార్టీలో అందరు అలాంటి వాళ్ళే ఉన్నారన్నది తన ఉద్దేశ్యంకాదని కానీ కొందరు అలాంటి వాళ్ళే ఉన్నట్లు తనకు బాగా తెలుసన్నారు.
అంటే పవన్ చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే వైసీపీ, టీడీపీ తరపున జనసేనలో కోవర్టులున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉంది. కాబట్టి ఆ పార్టీ తరపున జనసేనలో కోవర్టులు ఎందుకుంటారు ? జనసేనేమీ బ్రహ్మాండమైన ప్రజామద్దతున్న పార్టీకాదు. పోనీ వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేంత గొప్పపార్టీయా అంటే అదీకాదు. అసలు జనసేనకున్న ఓటుబ్యాంకు ఎంత ? వచ్చే ఎన్నికల్లో పవన్ స్టాండ్ ఎలాగుంటుందో కూడా ఎవరికీ తెలీదు.
ఇలాంటి జనసేనలో వైసీపీ తరపున కోవర్టులుంటారంటే నమ్మకం కుదరటంలేదు. ఇక టీడీపీ ప్రధాన ప్రతిపక్షం. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబునాయుడు తెగ ప్రయత్నిస్తున్నారు. మొన్ననే తన లవ్ ప్రపోజల్ కు పవన్నుండి సమాధానం రావటంలేదని బాధపడిపోయారు. పవన్+చంద్రబాబుకు కావాల్సిన కామన్ ఫ్రెండ్స్ జనసేనలో చాలామందే ఉన్నారు. కాబట్టి టీడీపీ తరపున జనసేనలో కోవర్టుల అవసరం కూడా లేదు.
అయినా సరే టీడీపీ, వైసీపీ తరపున పనిచేస్తున్న వారు కొందరు జనసేనలో ఉన్నారని పవన్ అనుమానిస్తుండటమే విచిత్రంగా ఉంది. అలాంటి వారెవరో తనకు తెలసని చెప్పిన పవన్ ఇంకా అలాంటి వాళ్ళని పార్టీలోనే ఎందుకు కంటిన్యు చేస్తున్నారు ? హేమిటో జనసేనలో కూడా కోవర్టుటున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబూ ఇదే మాటంటున్నారు. ఇపుడు పవన్ కూడా ఇదే చెబుతున్నారు. ఎవరు చెప్పేది నిజమో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి