రాష్ట్రంలో జిల్లాల విభజన అంశం బాగా హాట్ టాపిక్ అయిపోయిన విషయం తెలిసిందే...ఎక్కడ చూసిన దీనిపైనే చర్చలు నడుస్తున్నాయి...ఇతర సమస్యలని సైతం పక్కనబెట్టి జనం జిల్లాల విభజన గురించి మాట్లాడుకుంటున్నారు. అలాగే ఈ విషయంలో రాజకీయ పరమైన చర్చలు కూడా వస్తున్నాయి. జిల్లాల విభజన వల్ల వైసీపీకి ఎంత లాభం వస్తుంది? అలాగే టీడీపీకి దీని వల్ల నష్టం ఏమన్నా జరుగుతుందా? అనే అంశాలపై విశ్లేషణలు వస్తున్నాయి.

ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లా విభజనతో వైసీపీకి లాభం జరుగుతుందని, ఆ పార్టీ అనుకూలంగా ఉన్నవారు మాట్లాడుకుంటున్నారు. పార్లమెంట్ స్థానాల వారీగా జిల్లాలని చేయడంతో శ్రీకాకుళం పార్లమెంట్ కూడా ఒక జిల్లాగా మారుతుంది. ఈ పార్లమెంట్‌లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి...అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే..విజయనగరం పార్లమెంట్‌లో ఉండే ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని కూడా శ్రీకాకుళంలో కలిపారు. అయితే ఇది పాత శ్రీకాకుళం జిల్లాలో ఉండేది. అలాగే పాత శ్రీకాకుళం జిల్లాలో ఉండే రాజాంని విజయనగరం జిల్లాలో కలపగా, పాలకొండ నియోజకవర్గాన్ని పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన మన్యం జిల్లాలో కలిపారు.

అంటే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అయితే ఎచ్చెర్లని విజయనగరంలో కలిపితే పోరాటాలు చేయడానికి టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు సిద్ధమయ్యారు. అప్పుడు రాజకీయంగా వైసీపీని దెబ్బ కొట్టవచ్చని అనుకున్నారు. కానీ కిమిడి వ్యూహానికి చెక్ పెడుతూ...జగన్ ప్రభుత్వం ఎచ్చెర్లని...శ్రీకాకుళంలోనే ఉంచింది. దీంతో కిమిడికి రాజకీయంగా ఎలాంటి ఛాన్స్ లేకుండా పోయింది.

ఇలా ఎచ్చెర్లని శ్రీకాకుళంలో ఉంచేయడం వల్ల వైసీపీకి కాస్త పాజిటివ్ పెరుగుతుందనే చెప్పాలి. ఇప్పటికే ఎచ్చెర్లలో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది...ఇలాంటి తరుణంలో ఎచ్చెర్లని తీసుకెళ్లి విజయనగరంలో కలిపి ఉంటే వైసీపీకి ఇంకా నెగిటివ్ వచ్చేది...కానీ శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించడం వల్ల ఇబ్బంది లేకుండా పోయింది. మొత్తానికి వైసీపీ వ్యూహంతో ఎచ్చెర్లలో కిమిడి కళా వెంకట్రావుకు చెక్ పడినట్లే అని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: