కాకిపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేదీ కవితకు అనర్హం అంటూ చెప్పారు శ్రీశ్రీ. అయితే నేటి రోజుల్లో ఎంతోమంది ఫ్యాషన్ ప్రియులు కూడా ఇక శ్రీశ్రీ చెప్పిన మాటలను బాగా ఫాలో అవుతున్నారు. ప్యాషన్ మీద పిచ్చి ఉండాలి గానీ  కాదేది అనర్హం అన్న విధంగానే వ్యవహరిస్తున్నారు. అందరిలా కాదు కాస్త భిన్నంగా ట్రై చేస్తే బాగుంటుంది గురు అంటూ చెబుతూ చిత్ర విచిత్రంగా వినూత్న ప్రయత్నాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు నేటి రోజుల్లో ఎంతోమంది. ఇక ఇలా వారి చిత్రమైన ప్రయత్నాలు చూసిన తర్వాత వీరికి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందబ్బా అని అందరూ అవాక్కవుతు ఉంటారు.


 ఇలా ఇప్పటికే మనం రోజూ వాడే వస్తువుల తో కాస్త కొత్తగా ట్రై చేసి ఫ్యాషన్ టచ్ ఇచ్చినా ఎన్నో వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఇలాంటిదే  జరిగింది. సాధారణంగా చిప్స్ అందరం తింటూ ఉంటారు. తిన్న తర్వాత ప్యాకెట్ డస్ట్ బిన్లో పడేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం  డస్ట్ బిన్లో పడేయ లేదు ఆ మహిళ. చిప్స్ ప్యాకెట్ తో చీర తయారుచేసింది. ఎప్పుడు రకరకాల ఫ్యాషన్ దుస్తులు  వేసుకుంటూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది ఆ యువతి.


 ఇప్పుడూ చిప్స్ ప్యాకెట్ తో చీర తయారుచేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇలా ఓ మహిళ చిప్స్ ప్యాకెట్  తయారు చేసిన వాటిని ధరించి నడుస్తున్న ఒక వీడియోని ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారిపోయింది. ఇక ఇదంతా చూసిన తర్వాత వారు ఐడియా బాగుంది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ మరి కొంతమంది అంటున్నారు. ఏదేమైనా ఈ చిప్స్ ప్యాకెట్ చీర మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: