మరి ఇప్పుడు ఎందుకు ఉక్రెయిన్ ఊరుకుంటోంది.. ఎందుకు రష్యా దూకుడును అడ్డుకోలేకపోతోంది.. రష్యా ఎందుకు అంత ధైర్యంగా యుద్ధం ప్రారంభించింది. ఇందుకు సమాధానం.. చరిత్రలో ఉక్రెయిన్ చేసిన ఒకే ఒక తప్పు అని చెప్పొచ్చు. అదేమిటంటే.. గతంలో వేలాదిగా అణ్వాయుధాలు కలిగిన ఉక్రెయిన్.. వాటిని నాశనం చేయడమే.. అలా ఎందుకు చేసింది.. ఇందుకు కారణం అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మధ్య జరిగిన ఒప్పందం.
ప్రపంచంలో అణ్వాయుధాలను నిర్మూలించాలన్న లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి.. ఉక్రెయిన్‌ను అణ్వాయుధాల అప్పగింతకు ఒప్పించింది. ఇక్కడ మరో విషయం చెప్పాలి.. ఉక్రెయిన్ అంటే.. ఒకప్పుడు రష్యాలో భాగమే. సోవియట్ యూనియన్ అనేక దేశాలుగా విడిపోయిన సమయంలో అప్పటి రష్యాకు ఉన్న అణ్వాయుధాలను కొన్ని దేశాలు పంచుకున్నాయి. అలా ఉక్రెయిన్ ఏర్పాటుతోనే ఐదువేల అణ్వాయుధాలు కలిగి ఉంది.
ఈ స్థాయిలో అణ్వాయుధాలు ఉక్రెయిన్ మినహా అమెరికా, రష్యాలోనే ఉన్నాయి. అంటే.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అణుశక్తి ఉక్రెయిన్ అని చెప్పుకోవచ్చు. అణ్వాయుధాల నిరోధంలో భాగంగా అణ్వాయుధాలను నాశనం చేసేందుకు ఉక్రెయిన్ ఒప్పుకుంది. అలా చేసినందుకు ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి.. ఉక్రెయిన్ సరిహద్దులను గౌరవించాలని ఒప్పందం ఉంది. అంతే కాదు.. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా అమెరికా, రష్యా ఎలాంటి సైనిక శక్తిని వాడకూడదు. అయితే ఆ మాటలను ఇప్పుడు ఆ దేశాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ వద్ద అణ్వాయుధాల లేకపోవడం కూడా రష్యా దూకుడుకు కారణమైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి