ఒకే ఒక తప్పు వీళ్ళ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా దెబ్బకొట్టేసింది. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో 23 మందిని, ముగ్గురు ఎంపీలను చంద్రబాబునాయుడు ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి లాగేసుకున్న విషయం తెలిసిందే. 2014లో గెలిచిన 67 మంది ఎంల్ఏల్లో చాలామంది కేవలం జగన్మోహన్ రెడ్డి కారణంగానే గెలిచారు. అయితే వీరిలో 23 మంది చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి వైసీపీలో నుండి టీడీపీలోకి ఫిరాయించారు.





తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నంతవరకు బాగానే ఉంది కానీ తర్వాత వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమైంది ? ఏమైందంటే వీళ్ళల్లో చాలామందికి చంద్రబాబు అసలు 2019లో టికెట్లే ఇవ్వలేదు. ప్రలోభాలకు గురిచేసినపుడు, పార్టీ ఫిరాయించకముందు వీళ్ళందరి ప్రయోజనాలను కాపాడుతానని, 2019 ఎన్నికల్లో పోటీచేసేందుకు మళ్ళీ టికెట్లిస్తానని చంద్రబాబు హామీఇచ్చారు. చంద్రబాబును నమ్మటమే వాళ్ళు చేసిన తప్పని తర్వాత కానీ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. 





ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మాటలు నమ్మి, హామీ అమలుచేస్తాడని నమ్మి జగన్మోహన్ రెడ్డిని కాదనుకుని టీడీపీలోకి ఫిరాయించారు. తీరా ఎన్నికలొచ్చిన తర్వాత చూస్తే కొందరికి టికెట్లివ్వలేదు. టికెట్లు తీసుకుని పోటీచేసిన వాళ్ళల్లో ఒకళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా ఓడిపోయారు. అంటే 2019 ఎన్నికల నాటికి 23 మంది ఫిరాయింపు ఎంఎల్ఏల్లో 22 మంది రాజకీయ భవిష్యత్తు సమాధైపోయింది. టీడీపీ కూడా ఘోరంగా ఓడిపోవటంతో వీళ్ళని చంద్రబాబు కూడా దగ్గరకు రానీయటంలేదు.





అంటే వీళ్ళ పరిస్ధితి ఎలాగైపోయిదంటే ఇటు వైసీపీలోకి వెళ్ళలేక అటు టీడీపీలో ఉండలేక నానా అవస్తలు పడుతున్నారు. విచిత్రమేమిటంటే ఈ 22 మంది మాజీ ఎంఎల్ఏలను వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ పార్టీ క్యాడర్ కూడా నమ్మటంలేదు. దాంతో ప్రలోభాలకు గురైన పాపానికి వీళ్ళ రాజకీయ జీవితాలు బలైపోయాయి. వీళ్ళంతట వీళ్ళే ఈ పరిస్ధితి తెచ్చుకున్నారు కాబట్టి ఎవరికీ వీళ్ళంటే సానుభూతిలేదు. భూమానాగిరెడ్డి, సర్వేశ్వరరావు మరణించారు. గొట్టిపాటి రవికుమార్ ఒక్కళ్ళే టీడీపీ తరపున 2019లో గెలిచారు. మిగిలిన 20 మందిని జనాలు ఎప్పుడో మరచిపోతే అనామకంగా బతికేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: