అమరావతి రైతులకు ఇది ఓ చిన్న గుడ్ న్యూస్.. ఏపీ రాజధాని అమరావతిలో  కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ జి. వి. ఎల్‌. నరసింహా రావు కేంద్రానికి లేఖలు రాశారు. పలువురు కేంద్ర మంత్రులకు  బీజేపీ ఎంపీ జి. వి. ఎల్‌. నరసింహా రావు లేఖలు రాశారు. చంద్రబాబు గతంలో రాజధానిగా అమరావతిని ప్రకటించగానే అనేక కేంద్ర సంస్థలు అమరావతిలో స్థల సేకరణ జరిపాయి. చంద్రబాబు సర్కారు ఉదారంగా వారికి భూములు ఇచ్చింది.


అయితే ఆ తర్వాత చంద్రబాబు దిగిపోయి జగన్ రావడం, మూడు రాజధానుల ప్రతిపాదన వంటి కారణాలతో ఆయా  కేంద్ర శాఖలు డైలమాలో పడ్డాయి. అప్పటి నుంచి కార్యాలయాలు నిర్మించకుండా వేచి చూస్తున్నతాయి. అయితే. ఇటీవల మూడు రాజధానుల బిల్లును రాష్ట్రం  ఉపసంహరించుకుంది. అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది.


అందుకే.. ఇక జాప్యం లేకుండా ఆయా శాఖలు, సంస్థలూ కార్యాలయాలు నిర్మించాలని  జీవీయల్ నరసింహారావు తన లేఖల్లో ప్రస్తావించారు. తమకు ఇచ్చిన స్థలాలలో ఆరు నెలలలోగా భవన నిర్మాణం ప్రారంభించాలన్న ఇప్పటికే షరతు ఉన్న విషయాన్ని  జీవీయల్ నరసింహారావు ఆ లేఖల్లో ప్రస్తావించారు. అందుకే ఇప్పటికైనా నిర్మాణాలపై దృష్టి సారించాలని బీజేపీ ఎంపీ జి. వి. ఎల్‌. నరసింహా రావు కోరుతున్నారు. రాజధానిగా అమరావతి నిర్మాణం అంటే ఈ నిర్మాణాలన్నీ అందులో భాగం, కీలకం అని బీజేపీ ఎంపీ జి. వి. ఎల్‌. నరసింహా రావు గుర్తు చేశారు.


ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ మౌలిక వసతులైన రోడ్లు, డ్రెయిన్లు, నీటి సరఫరా, విద్యుత్ వంటి సదుపాయాలను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేస్తుందని జీవీల్‌ తన లేఖలో తెలిపారు. ఇక కార్యాలయాల నిర్మాణానికి అమరావతి సిద్ధంగా ఉన్నట్లేనని..బీజేపీ ఎంపీ జి. వి. ఎల్‌. నరసింహా రావు అంటున్నారు. జీవీఎల్‌ గత నెల ఏడున దేశ రాజధాని దిల్లీలో అమరావతి రైతులను కలిశారు. అప్పుడు వారికి ఇచ్చిన హామీ కోసమే ఇప్పుడు జివిఎల్ నరసింహారావు కేంద్ర కార్యాలయాల నిర్మాణానికి లేఖలు రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: