గడచిన మూడు నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ఇంకా ఎంతకాలం జరుగుతుందో తెలీదు. ఇప్పటికి జరిగిన యుద్ధంలో ఇటు ఉక్రెయిన్ అటు రష్యా రెండు దేశాలూ బాగా నష్టపోయాయి. రష్యా సైన్యం దాడికారణంగా ఉక్రెయిన్లోని చాలా నగరాలు చాలావరకు నేలమట్టమైపోయాయి. లక్షలాదిమంది జనాలు, వేలాదిమంది సైనికులు చనిపోయారు. ఇదే సమయంలో రష్యా సైనికులు కూడా వేలాదిమంది చనిపోయారు.

అంటే యుద్ధంవల్ల లాభపడింది ఎవరు లేరుకానీ రెండుదేశాలూ నష్టపోయాయన్నది వాస్తవం. అయితే యుద్ధంతో ప్రత్యక్షంగా సంబంధంలేని ఒక దేశం మాత్రం విపరీతంగా లాభపడుతోంది. అదే అగ్రరాజ్యం అమెరికా. రెండు దేశాల యుద్ధంలో అమెరికా ఎలా లాభపడుతోంది ? ఎలాగంటే ఆయుధాల సరఫరా, అమ్మకాల ద్వారా అమెరికా విపరీతంగా లాభపడుతోంది. ప్రపంచంలో ఏ రెండుదేశాల మధ్య యుద్ధం జరిగినా అందులో ఎక్కువగా వాడే ఆయుధాలు అమెరికా తయారీవే అయ్యుంటాయి.

ఇపుడు ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కూడా ఉక్రెయిన్ ఉపయోగిస్తున్న ఆయుధాలు ఎక్కువగా అమెరికా తయారీవే. అలాగే ఉక్రెయిన్ కు నాటోదేశాలు సాయంచేస్తున్నాయి. ఈ సాయం నిత్యావసరాలో, మందులో లేక నిధుల రూపంలోనే జరగటంలేదు. ఆ దేశాలన్నీ ఉక్రెయిన్ కు ఆయుధాలనే అందిస్తున్నాయి. నాటో దేశాలు అందిస్తున్న ఆయుధాల్లో అత్యధికం గతంలో అమెరికా నుండి కొన్నవే. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ తయారీ సంస్ధ లాక్ హీడ్ మార్టిన్ అమెరికా సంస్ధే. అలాగే ప్రపంచంలో అత్యధిక, ఆత్యాధునిక ఆయుధాలు తయారుచేసే కంపెనీల్లోని మొదటి ఏడు కంపెనీలు అమెరికావే.

ఈ కంపెనీలన్నీ ప్రైవేటు కంపెనీలే. అందుకనే అమెరికా కాంగ్రెస్ లోని సభ్యులు, రాజకీయనేతలు, ప్రముఖ వ్యాపారసంస్ధలు ఆయుధ తయారీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి. కాబట్టి యుధ్ధం ఎక్కడ జరిగినా వెంటనే ఆయాదేశాలు పెద్దఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తాయి  కాబట్టి సహజంగా లాభపడేది అమెరికానే. ఇపుడు లాభపడుతున్నది కూడా అమెరికాయే అన్న విషయం అర్ధమైంది. అందుకనే అమెరికా ఎప్పుడూ యుద్ధాలనే కోరుకుంటుంది. ఇపుడు ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా అమెరికా పుణ్యమే.

మరింత సమాచారం తెలుసుకోండి: