వచ్చే ఎన్నికల విషయంలో తెలుగుదేశంపార్టీ మేకపోతు గాంభీర్యం పాటిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే, గెలుపు టీడీపీదే అంటు చంద్రబాబునాయుడు ఏదేదో మాట్లాడేస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటో చంద్రబాబుకు బాగా తెలుసు. కాకపోతే పైకి ఎందుకిలా మాట్లాడుతున్నారంటే పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్న మిత్రపక్షాలు బీజేపీ, జనసేనకు సీట్ల విషయంలో బార్గైనింగ్ కెపాసిటి లేకుండా చేయాలనంతే.






ఏదో ఇచ్చినన్ని సీట్లు మహాప్రసాదం లాగ తీసుకుని మాట్లాడకుండా పోటీచేసేట్లుగా చేయాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. అయితే చంద్రబాబు, తమ్ముళ్ళ మాటలతో జనసేన అధినేత పవన్ అహం దెబ్బతిన్నట్లుంది. అందుకనే చంద్రబాబు ఊహించని రీతిలో మూడు ఆప్షన్లు ప్రకటించారు. దాంతో ఇపుడు తమ్ముళ్ళలో టెన్షన్ పీక్స్ కు చేరుకుంటోంది. మూడు ఆప్షన్లలో ఒకటైన జనసేన ఒంటరిగా పోటీచేయటం అనేది చంద్రబాబు ఊహించనిది.






పవన్ చెప్పినట్లు నిజంగానే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేస్తే మాత్రం  టీడీపీ పరిస్దితి చాలా ఘోరంగా ఉంటుంది.  జనసేనకు ఎక్కువ సీట్లు రాకపోవచ్చు, పవన్ గెలుస్తారో లేదో చెప్పలేకపోవచ్చు కానీ టీడీపీ మాత్రం ఓడిపోక తప్పదు. టీడీపీ ఓడిపోతే చాలా తొందరలో కనుమరుగైపోతుంది. పార్టీ పరిస్ధితి తెలంగాణాలో ఎలా తయారైందో ఏపీలో కూడా అలాగే తయారైపోతుంది.  రాష్ట్రంలో పార్టీ ఉండదు, కొడుక్కి  భవిష్యత్తూ ఉండదు.






కాబట్టి పవన్ను అంతపనిచేయనీయకుండా చంద్రబాబు జాగ్రత్త పడతారనటంలో సందేహంలేదు. కాస్త అటుఇటుగా పవన్ అడిగినన్ని సీట్లు ఇచ్చుకోకతప్పదు. జనసేనకు తోడుగా బీజేపీ కూడా కలిస్తే ఇంకొన్ని సీట్లు వదులుకోవాల్సిందే. ఇక సీఎం కుర్చీఅంటారా ఏదో బతిమలాడుకుని ఈ ఒక్కసారికి తనకే అవకాశం ఇవ్వండంటు కాళ్ళావేళ్ళా పడతారు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవటం చంద్రబాబుకు కొత్తేమీకాదు. ఇపుడు గనుక కాళ్ళు పట్టుకోకపోతే పార్టీ భవిష్యత్తు అంతే సంగతులు. ఈ విషయం పవన్ కు బాగా తెలిసే ఒంటరిపోటీ అనే అస్త్రాన్ని ప్రయోగించింది. చూద్దాం చివరకు ఎవరు తగ్గుతారో ? ఎవరు త్యాగరాజులవుతారో ?

మరింత సమాచారం తెలుసుకోండి: