ఈ విషయంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా అయోమయంగా ఉన్నట్లున్నారు. ఎవరికీ లేనట్లుగా పవన్ కు మూడురకాలైన అభిమానులున్నారు. మొదటిరకమేమో సినీ అభిమానులు. రెండోరకమేమో రాజకీయ అబిమానులు. మూడోరకం అభిమానులు కులాభిమానులు.  ఈ మూడురకాల అభిమానులు ఎవరిదారి వారుగా వేర్వేరుగా ప్రయాణించిటంతోనే 2019 ఎన్నికల్లో జనసేన బొమ్మ అట్టర్ ఫ్లపయ్యింది.

పైన చెప్పుకున్న మూడురకాల అభిమానులగురించి మాట్లాడుకుందాం. సినీ అభిమానుల గురించి మాట్లాడుకుంటే వీళ్ళవల్ల పెద్దగా ఉపయోగముండదు. ఎందుకంటే సినిమాల్లో పవన్ను గట్టిగా అభిమానించే వాళ్ళల్లో చాలామందికి అసలు ఓటుహక్కే ఉండదు. అంత పది, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లపిలకాయలే ఎక్కువ. బహిరంగసభల్లో పవన్ను ఉద్దేశించి సీఎం సీఎం అని అరవటానికి మాత్రమే పనికొస్తారు తప్ప ఓట్లేయటానికి పనికిరారు.

ఇక రెండోరకమైన అభిమానులు రాజకీయ అభిమానులు. వీళ్ళసంఖ్య చాలా చాలా తక్కువనే చెప్పాలి. రాజకీయంగా పవన్ కే స్పష్టమైన అజెండా లేనపుడు ఇక వీళ్ళుమాత్రం పవన్ కు ఏ విధంగా ఉపయోగపడతారు. ఒక్కోరోజు ఒక్కోరకంగా మాట్లాడి రాజకీయాల్లో అయోమయం సృష్టించేస్తున్నారు. పవన్ రాజకీయంగా ఉన్నతస్ధితికి రావాలని రాజకీయభిమానులు కోరుకుంటున్నా వాళ్ళ ఆశ నెరవేరుతుందనే అవకాశంలేదు. రాజకీయంగా ఉన్నతస్ధితికి చేరుకునే అవకాశాలను తనంతట తానుగా పవనే చెడగొట్టుకుంటున్నారు.

ఇక కులాభిమానులు మూడోరకం. కులంరీత్యా కాపు ఓటర్లు, పవన్ కోసం పనిచేసే వాళ్ళు విశేషసంఖ్యలోనే ఉన్నారు. కాకపోతే వీళ్ళల్లో కొందరి ఓవర్ యాక్షన్ వల్ల మిగిలిన సామిజకవర్గాలు జనసేనకు దూరమైపోతున్నాయి. అంటే వీళ్ళ వల్ల పవన్ కు లాభంకన్నా నష్టమే ఎక్కువ జరుగుతోంది. ఈ విషయం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేయించుకున్న సర్వేలో బయటపడిందట. మరిలాగ ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళని పవన్ కట్టడి చేస్తారా లేకపోతే చూసీచూడనట్లు వదిలేస్తారా ? అన్నది తెలీదు. ఇలాంటి వాళ్ళవల్లనే ప్రజారాజ్యంపార్టీ నిండా ముణిగిపోయింది. సో ఈమూడురకాల అబిమానుల్లో పవన్ కు ఏరకమైన అభిమానులు ఉపయోగపడతారన్నది అయోమయమే. మరీ అభిమానుల విషయంలో ఎప్పటికి క్లారిటి వస్తుందో తెలీటంలేదు. కనీసం పవన్ కన్నా క్లారిటి ఉందో లేదో తెలీదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: