ఒకప్పుడు రహదారులపై రోడ్డు దాటేందుకు ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడేవారు. కొన్నిసార్లు సిగ్నల్స్ లేని చోట ఇక రోడ్డు దాటేందుకు ప్రయత్నించి చివరికి రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ ఉండేవారూ. ఇలా కాలినడకన వెళ్తున్న వారు రోడ్డు దాటుతున్న సమయంలో అటు వాహనదారులకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉండేవి అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అటు ప్రభుత్వాలు ఫుట్ ఓవర్ బ్రిడ్జి లను నిర్మిస్తున్నాయ్. ఈ క్రమంలోనే రహదారులు దాటాలి అనుకున్నవారు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో ఒక వైపు నుంచి మరో వైపు వెళ్లగలుగుతారు.


 ఇక వీటి కారణంగా అటు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోవడమే కాదు.. మరోవైపు అటు కాలినడకన వెళ్తున్న వారు ఎలాంటి రోడ్డు ప్రమాదం బారిన పడటం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి ని కేవలం కాలినడకన వెళ్లే వారు మాత్రమే ఉపయోగించడం చూశాము. కానీ ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిసిన తరువాత మాత్రం ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఇలా కూడా ఉపయోగించవచ్చ అని ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటారు. ఏకంగా బ్రిడ్జిపై ఆటో తోలాడు ఒక వ్యక్తి.


 మహారాష్ట్రలోని ఢిల్లీ- చెన్నై లను కలిపే జాతీయ రహదారి 48  పాల్ గారు జిల్లాలో ఉంది. అక్కడ కాలినడకన వచ్చే వారు ఒక వైపు నుంచి మరో వైపు దాటేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలోనే ఒక ఆటో డ్రైవర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి పైనుంచి ఆటో నడపడం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే suv లకు సాధ్యం కాని ఈ ఫీట్ అతను ఎలా చేశాడు అన్నది ప్రస్తుతం ప్రశాంతంగా మారిపోయింది.  అయితే అక్కడ ర్యాంప్ సౌకర్యం ఉంది. రోడ్డు దాటాలనుకున్న డ్రైవర్ ర్యాంప్ ఎక్కించి తాపీగా ఇక బ్రిడ్జిపై నుంచి రోడ్డు దాటాడు అని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ గా   మారిపోవడంతో అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: