రేషన్, బ్యాంకు, నుంచి సిమ్ కార్డుల వరకూ ఇప్పుడు అన్నీటికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ లేనిది ఒక చోట నుంచి మరోక చోటకు పోవడాని కి కూడా ఆధార్ తప్పనిసరి.. మనకు కావలసిన ముఖ్యమైన డాక్యుమెంట్ లలో ఇది కూడా ఒకటి.. అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్ ను దుర్వినియోగం చేస్తారు.అంతేకాదు.. అసాంఘిక కార్యకలాపాల కు ఎక్కువగా ఉపయోగిస్తారు. వాటి గురించి తెలుసుకోవడం తప్పనిసరి. లేకుంటే మనం చిక్కుల్లొ పడతారు..
ఈ కారణంగానే మనకు తెలియకుండానే ఎన్నో ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వం పథకాల నుంచి మొదలు చిన్న చిన్న అవసరాలకు సైతం ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే మన ఆధార్ కార్డును దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఆధార్ కార్డులతో దొంగ సిమ్‌ల ను తీసుకుంటున్న ఇటీవల వార్తా కథనాలు వస్తున్నాయి.
కొందరు నేరస్థులు ఇతరుల ఆధార్డ్ కార్డు తో అక్రమంగా సిమ్ కార్డులను తీసుకొని వాటిని అసాంఘిక కార్యక్రమాల కు ఉపయోగిస్తున్నారు. మీ ఆధార్ కార్డు తో ఏవైనా సిమ్ కార్డులు తీసుకున్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక ఆప్షన్‌ను అందించింది. టాఫ్-కాప్ పేరు తో ఒక వెబ్‌సైట్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ అవకాశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్ పౌరుల కు మాత్రమే అందుబాటులో ఉంది..
ఎలా చెక్ చేసుకొవాలంటే..
* ముందుగా వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.
* అనంతరం మొబైల్ నంబరు ను ఎంటర్ చేసి 'రిక్వెస్ట్ ఓటీపీ' ఆప్షన్ మీద నొక్కాలి.
* ఓటీపీని ఎంటర్ చేసి 'వాలిడేట్'పై క్లిక్ చేయాలి.
* వెంటనే మీ ఆధార్ సంఖ్య పై తీసుకున్న మొబైల్ నంబర్లు/ సిమ్‌ల వివరాలన్నీ కనిపిస్తాయి.
* వీటిలో మీకు సంబంధించిన నెంబర్లు లేకపోతే అక్కడే రిపోర్ట్ చేసుకోవచ్చు.. త్వరగా ఈ పని చెయ్యండి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి