ఒక్కోసారంతే తాను ఏమి రాతలు రాస్తోందో కూడా ఎల్లోమీడియా తెలీకుండానే రాసేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని జనాల ముందు నెగిటివ్ చూపించాలనే తాపత్రయంలో పాజిటివ్ గా ప్రొజెక్టుచేస్తోంది. తాజాగా జరిగిన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలు అందరికీ తెలిసిందే. ఏడుస్ధానాల్లో వైసీపీ ఆరింటిని గెలుచుకుంటే టీడీపీ ఒకటి గెలుచుకుంది. నిజానికి గెలుచుకునేంత సంఖ్యాబలం లేకపోయినా చంద్రబాబునాయుడు నామినేషన్ వేయించి పంచుమర్తి అనూరాధను గెలిపించుకున్నారు.





ఏడుసీట్లు వస్తాయని అనుకున్న వైసీపీకి ఒకసీటులో బొక్కపడింది. ఇక్కడే ఎల్లోమీడియా ఓవర్ యాక్షన్ తో రాసిన రాతలు చాలా విచిత్రంగా ఉన్నాయి. జగన్ క్యారెక్టర్ ను పాజిటివ్ గా చూపించటమే కాకుండా చంద్రబాబునాయుడు క్యారెక్టర్ ను నెగిటివ్ గా చూపింది. వైసీపీ నలుగురు ఎంఎల్ఏలు క్రాస్ ఓటింగ్ చేసిన ఫలితంగానే టీడీపీ అభ్యర్ధి గెలిచారు. నలుగురు ఎంఎల్ఏలు ఎందుకు క్రాస్ ఓటింగ్ చేశారు ? ఇద్దరు రెబల్ గా తయారైతే మరో ఇద్దరు బయటపడకుండానే టీడీపీకి ఓట్లేశారు.





వీళ్ళిద్దరు ఎందుకిలా వేశారంటే వచ్చేఎన్నికల్లో వీళ్ళకి జగన్ టికెట్లు ఇవ్వనని చెప్పేశారట. పోలింగుకు ముందు కలిసినపుడు కూడా టికెట్లు ఇచ్చేది లేదని జగన్ ఖండితంగా చెప్పేశారని ఎల్లోమీడియా రాసింది. అంటే అర్ధమేంటి ? ఇద్దరి ఓట్లకోసం జగన్ డ్రామాలు ఆడలేదని చెప్పటమే కదా. టికెట్లు ఇవ్వనని చెప్పిన తర్వాత వీళ్ళిద్దరు ఓట్లు వేయరని తెలిసి కూడా జగన్ డ్రామాలు ఆడకుండా స్ట్రైట్ గా ఉన్నాడని సర్టిఫికేట్ ఇవ్వటమే కదా. ఇదే చంద్రబాబు అయితే ఇలా చేస్తారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.





అలాగే వైసీపీ ఎంఎల్ఏలను చీల్చి చంద్రబాబు నాలుగు ఓట్లు తెచ్చుకున్నారని చెప్పింది. అంటే అర్ధమేంటి ? చంద్రబాబు ఏవో ప్రలోభాలు పెట్టే వైసీపీ ఓట్లు వేయించుకున్నారని చెప్పటమే. చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలే కానీ స్ట్రైట్ పాలిటిక్స్ ఎప్పుడూ లేదని ఎల్లోమీడియా తేల్చి చెప్పేసింది.  జగన్ పై నెగిటివ్ గా రాస్తున్నామని అనుకుని చంద్రబాబులోని గబ్బంతా ఎల్లోమీడియా జనాలకు చెప్పేసింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: