ఎల్లోమీడియా వ్యవహారం అదేదో సామెతలో చెప్పినట్లుగా తయారైంది. సస్పెన్షన్ కు గురైన నలుగురు ఎంఎల్ఏలు బాగానే ఉన్నారు కానీ మధ్యలో ఎల్లోమీడియా తెగబాధపడిపోతోంది. ‘నలుగురు వైకాపా ఎంఎల్ఏల సస్పెన్షన్’ అనే హెడ్డింగ్ తో పే...ద్ద కథనం ఇచ్చింది.  ఆ కథనంలో ఎంఎల్ఏల తరపున లాయర్ గా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటనను తప్పుపడుతు, పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించింది. ప్రొసీజర్ ఫాలో కాకుండా నలుగురు ఎంఎల్ఏల మీద సస్పెన్షన్ వేటు ఎలా వేస్తారంటు నిలదీయటమే విచిత్రంగా ఉంది.





ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో వైసీపీ నుండి టీడీపీకి నలుగురు ఎంఎల్ఏలు క్రాస్ ఓటింగ్ చేశారని సజ్జల చెప్పటాన్ని ఎల్లోమీడియా తట్టుకోలేకపోయింది. ఆ నలుగురే క్రాస్ ఓటింగు చేసినట్లు పార్టీకి ఉన్న ఆధారాలు ఏమిటంటు నిలదీసింది. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగుకు పాల్పడినట్లు పార్టీ ఎలా నిర్ధారణకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించింది. యాక్షన్ తీసుకునే ముందు వాళ్ళకి షాకాజ్ నోటీసు ఇవ్వకుండానే సస్పెన్షన్ వేటు వేయటం అన్యాయమని గోలచేసింది.





నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగటంలేదని ప్రశ్నించినందుకే రెబల్ ఎంఎల్ఏలంటు ముద్రవేయటం ఏమిటని ఆందోళన వ్యక్తంచేసింది. పోలింగ్ జరిగిన 24 గంటల్లోనే వీళ్ళపై చర్యలు తీసుకోవటం పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారిందట. పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న మరికొంతమంది కూడా యాక్షన్ తీసుకుంటారా అంటు నిలదీయటమే విచిత్రంగా ఉంది.





ఈ నలుగురి బాటలోనే మిగిలిన వాళ్ళు వెళ్ళకుండా ఉండేందుకు హెచ్చరికాగానే నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారని ఎల్లోమీడియా తీర్మానించేసింది. ఇక్కడ విషయం ఏమిటంటే వైసీపీ తరపున గెలిచి టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేయటం తప్పని ఎల్లోమీడియాకు అనిపించలేదు. పైగా బలంలేకపోయినా అభ్యర్ధిని పోటీకి పెట్టి గెలిపించుకోవటం చంద్రబాబునాయుడు చాణుక్యమని ఆకాశానికి  ఎత్తేసింది. వైసీపీ ఎంఎల్ఏల్లో చీలికతెచ్చి టీడీపీని గెలిపించుకున్నట్లు చంద్రబాబు గురించి గొప్పగా చెప్పింది. నలుగురు ఎంఎల్ఏల మీద యాక్షన్ తీసుకున్న పార్టీ మరి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద మాత్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని వైసీపీలోనే చర్చించుకుంటున్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. సస్పెండైన ఎంఎల్ఏలు హ్యాపీగా ఉంటే మధ్యలో ఎల్లోమీడియా ఎందుకింత బాధపడుతోందో అర్ధంకావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: