కొద్దిరోజుల క్రితంవరకు జగన్మోహన్ రెడ్డిని పదేపదే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక విషయంలో టార్గెట్ చేస్తుండేవారు. అదేమిటంటే సంక్షేమపథకాలను ఇష్టంవచ్చినట్లు అమలుచేయటం వల్ల ఏపీని శ్రీలంక లాగో పాకిస్ధాన్ లాగో తయారుచేసేస్తున్నారని. పవన్ చేసే ఆరోపణలు, విమర్శల్లో నిజంలేకపోయినా జగన్ అంటే మంటకాబట్టి పదేపదే ఆరోపణలతో విరుచుకుపడిపోయేవారు.

ఆ తర్వాత విషయం అర్ధమై సంక్షేమపథకాలు అందుకునే వాళ్ళల్లో జనసేన అంటే వ్యతిరేకత మొదలవుతోందన్న విషయం అర్ధమవ్వటంతో మళ్ళీ నోరిప్పలేదు. సీన్ కట్ చేస్తే రాజమండ్రిలో జరిగిన మహానాడులో రాబోయే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు మొదటిదశ మ్యానిఫెస్టోను ప్రకటించారు. దాని ప్రకారం ప్రభుత్వంపైనా విపరీతమైన ఆర్ధికభారం పడుతుంది. ఒక అంచనా ప్రకారం చంద్రబాబు ప్రకటించిన సంక్షేమపథకాలను అమలుచేయాలంటే ఏడాదికి సుమారు 1 లక్ష కోట్లరూపాయలు అవసరం.

లక్షకోట్లరూపాయలు దేనికంటే చంద్రబాబు ప్రకటించిన మొదటిదశ మ్యానిఫెస్టో అమలుకు మాత్రమే. మళ్ళీ తొందరలోనే రెండోదశ మ్యానిఫెస్టో ఉంది. అందులో ఎలాంటి హామీలుంటాయో తెలీదు. వాటి అమలుకు ఇంకెంత ఖర్చవుతుందో తెలీదు. ఇవికాకుండా ఇపుడు జగన్ అమలుచేస్తున్న పథకాల భారం ఉండనే ఉన్నాయి. తాను అధికారంలోకి వస్తే ఇపుడు అమలవుతున్న సంక్షేమపథకాలను ఎత్తేయనని చంద్రబాబు స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి వీటి భారం కూడా కలిపితే ఎంతవుతుందో ఎవరు చెప్పలేరు. ఈ విషయంలో పవన్ ఆర్ధిక నిపుణులను అడిగితే బాగుంటుంది

మరిపుడు పవన్ ఎందుకని నోరిప్పటంలేదు ? జగన్ అమలుచేస్తున్న సంక్షేమపథకాలతో ఏపీ నాశనమైపోతోందని గొంతుచించుకున్న పవన్ కు చంద్రబాబు హామీలు వినబడలేదా ? చంద్రబాబు ఏపీని ఏ దేశంలాగ చేయాలని అనుకుంటున్నారో నిలదీయాలని పవన్ కు అనిపించలేదా ? పథకాలను జగన్ అమలుచేస్తుంటే శ్రీలంక లాగ అయిపోతోందని గోలచేసిన పవన్ మరి చంద్రబాబు హామీలతో ఏపీ ఏమైనా అమెరికా లాగ అవుతుందా ? ఈ విషయాలను భేరీజువేసుకునే మంత్రులు, వైసీపీ నేతలు ఇటు చంద్రబాబు, అటు పవన్ను వాయించేస్తున్నారు. మరి పవన్ సమాధానం చెబుతారా ?మరింత సమాచారం తెలుసుకోండి: