ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దీనికి అంగీకరించారు. కానీ గోధుమలను అమ్మడానికి ప్రయత్నిస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రష్యా దీనికి అంగీకరించడంతో పాటు తన వద్ద ఉన్న గోధుమలను కూడా అమ్మేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఆఫ్రికా దేశాలకు గోధుమలను పంపాలని చూస్తే సగానికి పైగా యూరప్ దేశాలకే వెళుతున్నాయి.
గోధుమలను అమ్మే వెహికల్స్ లోనే యూరప్ దేశాలు ఆయుధాలను కూడా ఉక్రెయిన్ కు పంపిస్తున్నారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపిస్తున్నారు. గోధుమలను ఆఫ్రికా దేశాలకు పంపిస్తే అక్రమ మార్గంలో యూరప్ దేశాలు వాటిని కొనుగోలు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. రెండు మూడు షిపులను చెక్ చేస్తే అందులో ఆయుధాలు దొరకడంతో రష్యా ఆ మధ్య గోధుమల సప్లై ని నిషేధించింది. సౌతాప్రికా అధ్యక్షుడు రంపోచిని రష్యా అధ్యక్షుడు పుతిన్ వివరాలు అడిగారు. అయితే పంపుతున్న గోధుమలు మా వద్దకు వచ్చే సరికి షిప్ సగం కంటే ఎక్కువ ఖాళీ అయిపోతుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు పుతిన్ కు వివరించారు.
దీనికి పరిష్కారం చూపకుండా పంపించేది లేదని మళ్లీ వివాదం మొదటికొచ్చింది. పుతిన్, జెలెన్ స్కీలు ఒకరికంటే ఒకరు ఎక్కువగా పంతాలకు పోయి తమ దేశ భూభాగాలనే కాకుండా ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులపై దెబ్బ కొడుతున్నారు. దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నది ఆ రెండు దేశాల పై ఇన్ని రోజులుగా ఆధారపడి బతికిన ఆఫ్రికా, యూరప్ దేశాలు. యుద్ధం ఎంత తొందరగా ముగిస్తే ప్రపంచ దేశాలకు అంత మంచిదంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి