సమాజంలో లోపాలను ఎత్తి చూపుతూ.. సమస్యల పరిష్కారం కోసం మన వంతు సాయం చేయవచ్చు. దీనివల్ల కుటుంబ పోషణ కొంత ఆశాజనకంగా ఉంటుంది. మరోవైపు సమాజంలో గౌరవం, ప్రతిష్ఠ దక్కుతాయి. మనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే గతంలో జర్నలిజానికి ప్రస్తుత జర్నలిజానికి చాలా తేడా ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా జనాల్లో జర్నలిజంపై ఉన్న దృక్పథం మారిపోయింది. రాజకీయ పార్టీల నీడలోకి యాజమాన్యాలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు వారికి నచ్చినా.. నచ్చకపోయినా.. యాజమాన్యాలు చేప్పినట్లు చేయాల్సి వస్తోంది.
యాజమాన్యాలు ఏ పార్టీలకు అయితే అనుకూలంగా ఉంటారో.. అందులో పనిచేసే జర్నలిస్టులను కూడా ఆ పార్టీ మనుషులుగా ప్రజలు చూడటం ప్రారంభించారు. మరోవైపు ప్రకటనలు తెస్తేనే జీతాలు ఇస్తాం అనే స్థాయికి కొన్ని పత్రికలు చేరాయి. తాజాగా ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ జర్నలిస్టు ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారకర ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, చందంపల్లి కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ చంద్ర బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ పోషణ భారమై పిల్లల హాస్టల్ ఫీజు చెల్లించలేని స్థితిలో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జర్నలిజం వృత్తికి అలవాటు పడ్డవారు వేరే ఏ పనికి ఆసక్తి చూపరు. జర్నలిజం అనే వ్యసనానికి అలవాటు పడిపోతారు. రైతు ఆత్మహత్యల మాదిరిగానే జర్నలిజం ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందేమో. భవిష్యత్తు జర్నలిజం తలచుకుంటే భయమేస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి