గద్దర్ ని కెసిఆర్ తో కలవనివ్వకుండా చేసినటువంటి విషయంపై రేవంత్ రెడ్డి కామెంట్ చేసినట్లుగా తెలుస్తుంది. అంతే కాకుండా అసెంబ్లీలో విపక్షాలను అసలు మాట్లాడనివ్వకుండా చేయడం, సభ నుండి కోమటిరెడ్డి, సంపత్ లను సస్పెండ్ చేయడం అనే విషయం గురించి కూడా ఆయన మాట్లాడారు. అంతేకాకుండా ఈటెల రాజేంద్ర కు జరిగినటువంటి అవమానం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం అయినటువంటి మహమ్మద్ అలీని ఒక హోం గార్డ్ వెనక్కి తిరిగి పంపించడం అనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇలాంటి అహంకార పూరితమైన చర్యలు చేయడం వల్లే ప్రజలు బీఆర్ఎస్ ను గద్దె దించి తమకు పట్టం కట్టారని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వాళ్ళు చేసిన చర్యల వల్లే బీఆర్ఎస్ ఉండవలసిన ప్లేసులో కాంగ్రెస్ ఉందని, అలానే గతంలో కాంగ్రెస్ ఉన్నటువంటి ప్లేస్ లో ఇప్పుడు బీఆర్ఎస్ ఉందని ఆయన అన్నారు. ఇప్పటికైనా మిమ్మల్ని బయటకి పోనివ్వకుండా చూడాలంటే మీరు అహంకారాన్ని వీడాలని బీఆర్ఎస్ కు ఆయన సూచించారు.
రేవంత్ అయితే అక్కడ చక్కగా ప్రసంగించారు. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిగిలిన పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి. తెలంగాణలో అయితే టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్, కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ ఇంకా ఎంఐఎం ఇలా ఈ పార్టీల లీడర్లందరూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటారు. వీరందరి విమర్శలు విన్న తర్వాత ప్లాన్-బి ప్రకారం చివరిగా షాడో లీడర్ తో ధీటుగా సమాధానం చెప్పించాలని కొంతమంది రేవంత్ కి సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి