కేవలం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని ఓడించాలని ఉద్దేశంతోనే ఇటు టిడిపి జనసేన పొత్తుల ప్రకటించుకొని మరి ఈసారి ఎన్నికలలో నిలబడబోతున్నాయి. అలాగే కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి పార్టీతో పొత్తుల విషయంలో కూడా పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవలే పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనసేన నేతలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయాలని చాలామంది సూచిస్తున్నారంటూ తెలిపారు.


అలా కాకపోతే ఎక్కువ స్థానాలు డిమాండ్ చేయాలని సలహాలు కూడా లేఖలు ఇస్తున్నారు అంటూ తెలిపారు పవన్ కళ్యాణ్.. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం టిడిపి తో పొత్తు చాలా ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తాను అంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.. లేకపోతే వైసీపీ పార్టీ గెలిస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అంటూ తెలిపారు. ఒంటరిగా పోటీ చేస్తే జనసేన పార్టీకి 40 సీట్లు వస్తాయని ఆ బలం తమకుందంటూ తెలుపుతున్నారు.


మనం పోటీ చేసి గెలిచేందుకు ఎలక్షన్స్ చాలా కీలకమని మనకు రావాల్సిన ప్రతి ఓటు పోలింగ్ బూత్ వరకు వెళ్లి మన గుర్తు మీద ఓటు వేసేలా చేయాలంటూ కేడర్ కి సైతం సూచించారు..వచ్చే ఎన్నికలలో రాజమండ్రి నుండి జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీ చేస్తారంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. ఇలా ప్రకటించడంతో అటు రాజమండ్రి రూరల్ సీట్ జనసేన టిడిపి నేతల మధ్య హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక టీడీపీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య పోటీకి సిద్ధమవుతున్న సమయంలో ఇలా జనసేన తమ అభ్యర్థుల ను ప్రకటించడంతో ఈ విషయం సంచలనంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: