సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ప రంగా యాక్టివ్ గా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. ఆంధ్రప్రదేశ్లో మరో రెండు నెలలు ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో అటు అధికార పార్టీ ప్రతిపక్షాల పార్టీలు సైతం తమ తమ ప్లాన్లతో ముందుకు వెళుతున్నారు. తాజాగా నటుడు రాజకీయ నాయకుడు అయినటువంటి వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ పైన మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాపులందరూ ఏకతాటి  పైకి తీసుకువచ్చిన పవన్ ఇప్పుడు తమ ఓట్లను టిడిపికి వేయండి అంటూ చెప్పడం వ్యభిచారంతో సమానం అంటూ పోసాని ఆరోపించారు.. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడినటువంటి పవన్ కళ్యాణ్ కాపులను మోసం చేసినట్టే అంటూ కూడా తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా మహిళల ట్రాఫికింగ్ జరుగుతోంది అంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించడం.. ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు.. ప్రస్తుతం ఎవరి ఊర్లలో మహిళలు వారు పని చేసుకుంటున్నారని అలాంటి ఆడబిడ్డలను పవన్ ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందన్నడం చాలా అన్యాయం అని కూడా తెలియజేశారు. ఈ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ సిగ్గుండాలని ఆంధ్ర ఆడబిడ్డలకు జనసేన పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలంటూ కూడా పోసాని తెలిపారు.

లేకపోతే కనీసం కాపు మహిళల కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడగాలంటూ పోసాని డిమాండ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అయితే ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పోసానిపైన తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా కాస్త చురుకుగా పాల్గొనేందుకు ప్రయత్నాలు చేయడం లేదు.. ముఖ్యంగా సీట్ల విషయం పైన కూడా ఎలాంటి క్లారిటీ కూడా ఇప్పటివరకు తెలియజేయలేదు..మేనిఫెస్టో గురించి కూడా ఏ విధంగా తెలుపలేదు. కానీ టిడిపి పార్టీతో జనసేన పొత్తుతో మాత్రం పోటీ చేస్తుందని విషయాన్ని పదే పదే తెలియజేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: