గత ఎన్నికల్లో భీమవరంతో పాటు గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండుచోట్లా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీను చేతిలో 8,357 ఓట్ల తేడాతో పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా తనకు తోడవ్వడంతో... తనకు గెలుపు కన్ ఫాం అని పవన్ కళ్యాణ్ ఫిక్సయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో స్థానికంగా నివాసం కూడా సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం తెలుస్తుంది.గత ఎన్నికల్లో భీమవరంలో టీడీపీ, జనసేన కు కలిపి సుమారు లక్షా ఆరువేల పైగా ఓట్లు పోలయ్యాయని.. వైసీపీ అభ్యర్థికి మాత్రం డెబ్భై వేళ పైగా మాత్రమే వచ్చాయి కాబట్టి... ఈసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవడం, అక్కడ నుంచి అసేంబ్లీకి వెళ్లడం ఖాయమని జనసైనికులు నమ్మకంగా చెబుతుండగా... రాజకీయాల్లో 1+1=2 కాదని.. ఈసారి కూడా భీమవరంలో ఫ్యాన్ గిరా గిరా తిరగడం గ్యారెంటీ అని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి కూడా ఈసారి భీమవరంలో వైసీపీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నరని అంటున్నారు.


 ఇక్కడ రీల్ హీరోపై రియల్ హీరోని గెలిపించాలని ప్రజలను వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో భీమవరంలో పోరు చాలా రసవత్తరంగా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.ఇంకా అలాగే మరోపక్క పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ టూర్ లో భాగంగా హస్తినలో బీజేపీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారని సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నీకలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ, బీజేపీ, జనసేన సీట్ల వ్యవహారంపై బీజేపీ పెద్దలతో చర్చించి పొత్తుపై ఒక స్పష్టత తేవాలని భావిస్తున్నారని అంటున్నారు. ఈ భేటీ తరువాత చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ హస్తినలో పెద్దలతో భేటీ అయ్యి.. కూటమి విషయంపై స్పష్టమైన క్లారిటీకి రావొచ్చని సమాచారం తెలుస్తుంది.ఏది ఏమైనా... గత ఎన్నికల్లో ఓడిపోయిన భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ మరోసారి పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. మరి ఈసారి భీమవరం ప్రజలు పవన్ కళ్యాణ్ కి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: