2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చాలా ఉత్కంఠాన్ని కలిగిస్తున్నాయి.. ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న టిడిపి జనసేన పార్టీ గెలవాలని చాలా వ్యూహాలను సైతం రచిస్తున్నారు. కానీ ఏపీ సీఎం మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తూ ఉంటే టిడిపి జనసేన మాత్రం కూటమిగా ఈసారి బరిలోకి దిగబోతోంది.. జగన్ ను ఢీకొట్టేందుకు ఆ బలం సరిపోదు అంటూ కూడా బిజెపి పార్టీతో పొత్తు కోసం ప్రాకులాడుతున్నారు.. మొత్తంగా చంద్రబాబు రాజకీయ జీవితంలోని ఎదుర్కోలేని పరిస్థితులను సైతం ఇప్పుడు ఎదుర్కొంటున్నారని వార్తలైతే వినిపిస్తున్నాయి.


అయితే ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు చేసిన ప్రసంగాలు వాక్యాలు ఇప్పుడు చంద్రబాబు పరువు తీసేలా ఉంటున్నట్టు తెలుస్తోంది. దీంతో పలువురు టిడిపి నాయకులు నేతలు కూడా ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగా 52 రోజులపాటు జైల్లో కూడా ఉన్నారు.. అలా పరామర్శించేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అనంతరం బయటికి వచ్చి టిడిపి జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయంటూ ప్రకటించారు.


అప్పటినుంచి తరచు తాను టిడిపిని ఆదుకున్నట్లుగా ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ పరోక్షంగా తెలిపారు.. తాను లేకపోతే టీడీపీకి విజయం కష్టమనే విధంగా కూడా ఆయన మాటలు ఉన్నాయంటూ పలువురు టిడిపి కార్యకర్తలు కూడా తెలుపుతున్నారు.. టిడిపి పరిస్థితి చాలా బలహీనంగా ఉందని తమతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఆ పార్టీ ప్రస్తుతం నిలబడిందని కామెంట్స్ గడిచిన రెండు రోజుల క్రితం చేయడంతో మరింత వైరల్ గా మారుతున్నాయి. దీంతో టిడిపి నేతలు ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేని పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం సబబు కాదు అంటూ కూడా తెలుపుతున్నారు. పొత్తు పెట్టుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ కనీసం కొన్ని చోట్ల అయిన గెలుస్తారని పొత్తు పెట్టుకున్నారని టిడిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఎవరి వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయం తెలియాలంటే మరొక కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: