ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు త్వరలోనే రాబోతున్న తరుణంలో పలు రకాల పార్టీ నాయకులు సైతం అందరూ యాక్టివ్గా మారి తమ హామీలను సైతం ఒక్కొక్కటిగా ప్రకటిస్తూ ఉన్నారు.. మరి కొంతమంది తమ అభ్యర్థులను ప్రకటిస్తూ ఉండగా మరికొంత మంది మేనిఫెస్టోను ప్రకటిస్తూ ఉన్నారు.. గతంలో టిడిపి పార్టీ ఆరు గ్యారెంటీ హామీలు అంటూ ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ తొలి హామీని ప్రకటించింది.. ఇందిరమ్మ అభయం అనే పేరుతో మొదటి గ్యారంటీని ఏపీ సీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు..


ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి కూడా నెలకు 5000 రూపాయలు ఇస్తామంటూ వెల్లడించారు. అనంతపురంలో నిర్వహించిన న్యాయ సాధన సభలో సైతం షర్మిల ఇలాంటి ప్రకటన చేశారు.. అయితే ఈ చెక్కులను కూడా మహిళల పేరు మీద ఇస్తామంటూ తెలియజేయడం జరిగింది.పేద కుటుంబాలు నిర్భయంగా బ్రతికేందుకే పేదరికాన్ని నిర్మూలించేందుకు ఇలాంటి పథకాన్ని ఇందిరమ్మ పేరు మీద తీసుకువచ్చామంటూ తెలియజేశారు.. కాంగ్రెస్ పాలనలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలను కూడా అమలు చేశారంటూ ఆమె వెల్లడించింది..


ఏపీ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని ఇతర రాష్ట్ర అభివృద్ధిలో వేగవంతంగా ముందుకు వెళుతున్నాయని చంద్రబాబు జగన్ ల వల్ల పదేళ్ల పాలనలో ఏపీ మల్లి 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అంటూ ఆమె విమర్శించారు.. పదేళ్లలో ఎలాంటి కంపెనీలు కూడా రాలేదని ప్రత్యేక హోదా విషయంలో జగన్ తోనే సాధ్యమాయని నమ్మిన ప్రజలు అధికారాన్ని అనుభవిస్తూ ప్రత్యేక హోదా కోసం ఎలాంటి ఉద్యమాన్ని చేపట్టలేదు అంటూ ఆమె విమర్శించారు.. వైసీపీ ఎంపీలు కూడా ఢిల్లీలో పెద్దగా ఈ విషయం పైన ఎక్కడ మాట్లాడలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదంటూ షర్మిల గారు విమర్శించారు.. మరి పడిపోయిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రలో లేపేందుకు షర్మిల తన సాయి శక్తుల ప్రయత్నాలు చేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: