ఏపీ కాంగ్రెస్ చీఫ్  వైఎస్ షర్మిలకు ఏదో అయ్యింది. ఆరుమాసాలు సావాసం చేస్తే వారు వీరవుతారనే సామెత షర్మిలకు సరిగ్గా సరిపోతుంది. విషయం ఏమిటంటే 3200 కిలోమీటర్ల  పాదయాత్రచేసి  వైసీపీని నిలబెట్టింది తానే అని చెప్పారు. అంటే తాను పాదయాత్ర చేయకపోతే వైసీపీ కుప్పకూలిపోయేదన్న భ్రమల్లో ఉన్నట్లున్నారు. బైబై బాబు అంటు ప్రచారంచేసి చద్రబాబునాయుడును గద్దెదింపింది కూడా తానేనట. ఒకప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంచేసింది కూడా తానే అన్నారు. షర్మిల సమైక్యాంధ్ర ఉద్యమం ఎప్పుడు చేసిందో తెలీటంలేదు.





విషయం ఏమిటంటే షర్మిల తనగురించి తాను చాలా అంటే చాలా చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్లున్నారు. షర్మిలకున్న ఐడెంటిటి ఏమిటంటే ఒకపుడు వైఎస్సార్ కూతురు తర్వాత జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అంతే. అంతకుమించి సొంతంగా ఆమెకేమీ గుర్తింపులేదు. నిజంగానే వైసీపీని నిలబెట్టేంత కెపాసిటి, చంద్రబాబును గద్దెదింపేంత సీన్ ఆమెకుంటె మరి తెలంగాణాలో పెట్టుకున్న సొంతపార్టీని ఎందుకు చాపచుట్టేసి కాంగ్రెస్ లో విలీనం చేశారు ? వైఎస్సార్టీపీ పేరుతో సొంతపార్టీ పెట్టుకుని రెండేళ్ళు నానా అవస్తలు పడినా జనాల్లో కనీసం గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోయిన విషయం అందరికీ తెలిసిందే.





రాజకీయపార్టీలు కాదు చివరకు జనాలు కూడా పట్టించుకోకపోవటంతో పార్టీ మూసేసి కాంగ్రెస్ లో విలీనంచేసేశారు. పార్టీని మూసేయటంతోనే షర్మిల కెపాసిటి ఏమిటో అర్ధమైపోయింది. అలాంటిది వైసీపీని నిలబెట్టింది తానే అని, చంద్రబాబును గద్దెదింపింది తానే అని చెప్పుకుంటే జనాలు ఎలా నమ్ముతారు. షర్మిల పాదయాత్రచేసినా, రోడ్డుషోలు చేసినా జగన్ ప్రతినిధిగానే అన్న విషయం అందరికీ తెలుసు.





జగన్ లేకపోతే తాను లేనన్న విషయాన్ని మరచిపోయి తనవల్లే జగన్ కు గుర్తింపు వచ్చింది, అధికారంలోకి వచ్చారన్నట్లుగా మాట్లాడారు. ఇలాంటి భ్రమల్లో ఉండే తెలంగాణాలో పార్టీ పెట్టుకుని అట్టర్ ఫ్లాపయ్యారు. ఇక చెల్లెనని చూడకుండా తనతో పాటు తన కుటుంబసభ్యులపై వైసీపీ సోషల్ మీడియాలో  చాలా అసభ్యంగా దూషణలు చేయిస్తున్నట్లు రెచ్చిపోయారు. షర్మిల, విజయమ్మ, వివేకానందరెడ్డి కూతురు సునీత తదితరులపై సోషల్ మీడియాలో వర్రా రవీంద్రారెడ్డి పేరుతో అసభ్యంగా పోస్టులు పెట్టింది టీడీపీ వాళ్ళే అని పోలీసులు తేల్చారు. పోస్టులుపెట్టిన ఉదయ్ భూషణ్ కూడా పోస్టులు పెట్టింది తానే అని అంగీకరించారు. అయినా రవీంద్రారెడ్డే తమపైన పోస్టులు పెడుతున్నట్లు షర్మిల పోలీసులకు ఫిర్యాదులు చేయటమే ఆశ్చర్యంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: